https://oktelugu.com/

Michael Jackson : వేలంలో లక్షలు పోసి కొన్నారు.. మైఖేల్ జాక్సన్ టోపీకి ఎంత ధర పలికిందో తెలుసా..?

ఇక మైకేల్ జాక్సన్ క్రేజ్ గురించి చెప్పాలంటే మన ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పిలవబడే ప్రభుదేవా కూడా మైకేల్ జాక్సన్ వెనకాల డాన్సర్ గా చేయడానికి ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2023 8:48 am
    Follow us on

    Michael Jackson : డాన్స్ పేరు చెబితే మన దేశం లో మనకు ప్రభుదేవా గుర్తుకు వస్తాడు. కానీ ప్రపంచం మొత్తం లో డాన్స్ కి రారాజు అయిన వ్యక్తి ఒకరు ఉన్నారు. మూన్ వాక్ స్టెప్ వేయాలంటే ఆయన లాగ ఎవరు వెయ్యలేరు. ఎంతమంది తనని అనుకరించాలని చూసిన ఏ ఒక్కరూ కూడా ఆయన ఎనర్జీ తో గానీ, ఆయన స్టైల్ తో గానీ మ్యాచ్ అవ్వలేదు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే యువత ఊగిపోతోంది,ఆయన ఒక పాట మీద స్టెప్ వేస్తే యూత్ కండ్లల్లో ఆనందం కనిపిస్తుంది. ఆయన ఎవరో కాదు మైకేల్ జాక్సన్.ఈ ప్రపంచం లోనే ఫేమస్ అయిన ఒకే ఒక వ్యక్తి ఆయన…

    మైకేల్ జాక్సన్ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఆయన చేసిన ఆల్బమ్స్ కానీ, ఆయన వేసిన స్టెప్ లు కానీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా మిగిలి పోవాల్సిందే. అయితే మైకేల్ జాక్సన్ చనిపోయి చాలా రోజులు అయిన కూడా ఆయన క్రేజ్ మాత్రం అసలు తగ్గడం లేదు.ఇక ఇప్పుడు కూడా ఆయనకి సంభందించిన ఒక విషయం మళ్ళీ ట్రెండింగ్ లో నిలిచింది.అది ఏంటంటే మైకేల్ జాక్సన్ మూన్ వాక్ స్టెప్ వేసేటప్పుడు ఆయన మొఖానికి అడ్డం గా ఒక క్యాప్ పెట్టుకుంటాడు దాంతో ఆయనతోపాటు గా ఆ క్యాప్ కూడా చాలా ఫేమస్ అయింది…

    ఎంతలా ఫేమస్ అయింది అంటే రీసెంట్ గా ప్యారిస్ లో ఆ క్యాప్ ని వేలానికి పెడితే 77,640 యూరోలకి అమ్ముడు పోయింది. అంటే ఇండియన్ కరెన్సీ లో 68 లక్షల 22 వేలకు పైనే ఉంటుంది. అంత డబ్బులు పెట్టీ మైకేల్ జాక్సన్ క్యాప్ ను కొనుగోలు చేశారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన క్రేజ్ జనాల్లో ఏ స్థాయి లో ఉందో…

    ఇక ఆయన గిటార్ ని గతేడాది అమ్మకానికి పెట్టగా అది 3 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది…ఇలా ఈయన లేకపోయినా కూడా ఈయన క్రేజ్ అనేది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గడం లేదు…అయితే ఆ మధ్య కొన్ని నకిలీ వస్తువులను పెట్టీ అవి మైకేల్ జాక్సన్ వాడినవి అని ప్రచారం చేయడం తో ప్రస్తుతం ఉన్న ఒరిజినల్ వస్తువులకు డిమాండ్ తగ్గింది…

    ఇక మైకేల్ జాక్సన్1958 వ సంవత్సరం ఆగస్ట్ 29 వ తేదీన అమెరికా లో జన్మించాడు. ఈయన పాప్ మ్యూజిక్ లో తనదైన గుర్తింపు ని పొందాడు…అయితే పుట్టుక తోనే నల్లగా ఉండే మైకేల్ జాక్సన్ తనకి మంచి రేంజ్ రావడం తో తెల్లగా అవ్వాలని ఆయన చాలా రకాలైన ప్లాస్టిక్ సర్జరీ లు కూడా చేయించుకున్నాడు. ఇక వాటి వల్లే ఆయన ఎక్కువ రోజులు బతకకుండ చిన్న ఏజ్ లోనే తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది అని చాలా మంది చెప్తూ ఉంటారు…ఇక ఈయనకి మొదటి నుంచి అందం అంటే చాలా ఇష్టం. అందుకే అందంగా కనిపించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసేవాడు అలాగే ఆయన కెరియర్ లో చాలా వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. ఇక హాలీవుడ్ లో ఆయన బయోపిక్ కూడా రాబోతున్నట్టు గా తెలుస్తోంది…ఇక ఇప్పటికే మూడు సార్లు ఆస్కార్ అవార్డ్ అందుకున్న జాన్ లోగన్ ఈ సినిమా కి కథ అందిస్తున్నాడు. అయితే డైరెక్టర్ ఎవరు అనే దానిమీద ఒకరిద్దరి పేర్లు వినిపించినప్పటికి ఇంకా ఎవరు కూడా ఫైనల్ అవ్వలేదు…

    ఇక మైకేల్ జాక్సన్ క్రేజ్ గురించి చెప్పాలంటే మన ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పిలవబడే ప్రభుదేవా కూడా మైకేల్ జాక్సన్ వెనకాల డాన్సర్ గా చేయడానికి ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. కానీ దానికి ప్రభుదేవా సెలెక్ట్ కాలేదు అలా ఐదు సంవత్సరాలలో ఐదు సార్లు వరుసగా అప్లై చేసినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు అంటే మైకేల్ జాక్సన్ వెనకాల డాన్సర్ గా చేయడానికి కూడా ప్రభుదేవా కి స్థానం దక్కలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన రేంజ్ డాన్స్ ఏంటి అనేది…