Skanda Collections: దే..దే..దేవదాస్ అంటూ దేవదాస్ సినిమాతో రచ్చ చేశాడు ఉస్తాద్ హీరో.. ఉస్తాద్ ఏంటి రామ్ కదా అనుకుంటున్నారా? అదే యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన ఇమేజ్ తో పాటు ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు రామ్. అమ్మాయిల కలల రాకుమారుడు ఈ హీరో. మంచి బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలో తన టాలెంట్ చూపించి స్టార్ డమ్ ను సంపాదించాడు రామ్ పోతినేని.
అప్పటి నుంచి రిజల్ట్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఈ హీరో ఇప్పుడు ‘స్కంద’ అనే సినిమాతో అందరి ముందుకు వచ్చాడు. చంద్రముఖి 2 v/s స్కంద అనే రేంజ్ లో సినిమా బరిలోకి దిగింది. లారెన్స్ తో రామ్ పోటీకి తలపడుతున్నాడు అంటూ అందరూ ఆత్రుతగా ఎదురుచూశారు. అయితే స్కంద సినిమా అంచనాలను అందుకుంటూ దూసుకొని పోయింది. అంతే కాదు చంద్రముఖి సినిమాకు పోటీని కూడా ఇచ్చింది. అయితే ఆరంభంలో కాస్త మిక్స్‌డ్ టాక్ సంపాదించింది. కానీ వసూళ్లు బాగానే వచ్చాయి. వసూళ్ల పరంగా దూసుకొని పోతుంది అనే టైమ్ లోనే వర్కింగ్ డేస్‌లో ఒక మాదిరి, వీకెండ్ డేస్ లో మరో విధంగా కలెక్షన్లు సాధిస్తూ.. తికమక పెట్టింది ఈ సినిమా. ఈ నేపథ్యంలో ‘స్కంద’ 8 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!
ఊరమాస్‌గా వచ్చిన స్కంద సినిమాలో రామ్ పోతినేని హీరోగా, బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందనే చెప్పాలి. ఈ భారీ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అలాగే, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, లోహితాశ్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్‌ను అందించాడు. అయితే’స్కంద’ మూవీకి నైజాంలో రూ. 13 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ కలిపి రూ. 19.50 కోట్లకు అమ్ముడైంది. ఇలా దీనికి తెలుగులో రూ. 41 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 2.20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 46.20 కోట్లు బిజినెస్ జరిగింది.
అంతా బాగున్న అల్లుడినోట్లో శని ఉన్నట్టు 8వ రోజు కలెక్షన్లు మొత్తం డౌన్ అయ్యాయి. అయినా మొదటి నుంచి ఉన్న కలెక్షన్లు చివరి వరకు వస్తాయా? అందుకే కావచ్చు 8వ రోజు బాక్సాఫీస్ డీలా పడింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపకల్పనలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘స్కంద’ మూవీకి ఆడియెన్స్ రెస్పాన్స్ తగ్గుతూనే ఉంది. దీంతో 8వ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 60 – 63 లక్షలు షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 70 లక్షలు వరకూ వసూలు చేసింది. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం రూ. 25 కోట్లు రాబట్టింది.
మరి ఇంకా థియేటర్లలో సినిమా వస్తుంది కదా.. అప్పుడే ఢీలా అంటే ఎలా అనుకుంటున్నారా? చూద్దాం ఈ రోజు రేపు కలెక్షన్లు ఎలా ఉంటాయో? రామ్ ను, చిత్ర యూనిట్ ను హుషారు తెప్పిస్తాయా? లేదా ఈ సారికి అడ్జెస్ట్ అవ్వండి అంటాయో మిగిలిన వివరాలు మళ్లీ చూద్దాం…