https://oktelugu.com/

SJ Suryah: భారతీయుడు 2 ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి ఎస్ జే సూర్య కామెంట్స్ వైరల్…

SJ Suryah: ఎస్ జే సూర్య స్టేజ్ మీదకి వచ్చి భారతీయుడు లాంటి వ్యక్తి మన సమాజంలో ఉంటే ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు జరగవని తను చెబుతూనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక భారతీయుడు ఉన్నాడు..

Written By:
  • Gopi
  • , Updated On : July 8, 2024 / 09:43 AM IST

    SJ Suryah comments about Pawan Kalyan in Bharateeyudu 2 event went viral

    Follow us on

    SJ Suryah: కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు 2 సినిమా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ ను పురస్కరించుకొని ఈ సినిమా మీద అంచనాలను పెంచడానికి రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇక అందులో చాలా మంది పాల్గొన్నారు. ఇక నటుడు ఎస్ జే సూర్య కూడా ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు.

    ఇక తను స్టేజ్ మీదకి వచ్చి భారతీయుడు లాంటి వ్యక్తి మన సమాజంలో ఉంటే ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు జరగవని తను చెబుతూనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక భారతీయుడు ఉన్నాడు.. ఆయన ఎవరో కాదు నా ఫ్రెండ్, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ చెప్పడంతో అక్కడున్న అభిమానులందరూ ఒక్కసారిగా గట్టిగా అరిచారు. నిజానికి ఎస్ జె సూర్యకి, పవన్ కళ్యాణ్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ‘ఖుషి ‘ సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డును కూడా బ్రేక్ చేసింది.

    అలాగే పవన్ కళ్యాణ్ కి ఈ సినిమాతోనే మొదటి ఇండస్ట్రీ హిట్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఆ తర్వాత మరోసారి ‘పులి ‘ అనే సినిమా కూడా వచ్చింది. అయితే ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. అయినప్పటికీ వీళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ మాత్రం ఎక్కడ చెడిపోలేదు. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్, ఎస్ జే సూర్య ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ గానే కొనసాగుతున్నారు.

    ఇక ఆ మధ్య ఒకసారి ఎస్ జే సూర్య మాట్లాడుతూ అవకాశం వస్తే మరోసారి పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేయడానికి తను రెడీగా ఉన్నానని కూడా చెప్పాడు. మరి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతానికైతే ఎస్ జే సూర్య డైరెక్షన్ ఏమి చేయకుండా నటుడిగా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపును పొందుతున్నాడు…