https://oktelugu.com/

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ట్వీట్.. కదిలిన తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం.. అసలేం జరిగిందంటే.?

Sai Dharam Tej: రీసెంట్ గా 'పి హనుమంతు' అనే యూట్యూబర్ తన ఫ్రెండ్స్ తో కలిసి తండ్రి కూతుర్ల మధ్య ఉన్న ఒక వీడియోని చూపించి చాలా వెకిలిగా అసహ్య పద జాలం తో కామెంట్స్ చేశారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : July 8, 2024 10:04 am
    Sai Dharam Tej slams YouTuber for disgusting joke on child

    Sai Dharam Tej slams YouTuber for disgusting joke on child

    Follow us on

    Sai Dharam Tej: ప్రస్తుత సమాజంలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తమ లైఫ్ ను లీడ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక సమాజానికి హాని కలిగించనంత వరకు ఎవరికీ నచ్చినట్టుగా వాళ్ళు బతకడంలో తప్పులేదు. కానీ సమాజానికి గానీ, చిన్న పిల్లలకు కానీ ఎవరికైనా సరే హాని కలిగే విధంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన కూడా వాళ్ళు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు.

    ఇక రీసెంట్ గా ‘పి హనుమంతు’ అనే యూట్యూబర్ తన ఫ్రెండ్స్ తో కలిసి తండ్రి కూతుర్ల మధ్య ఉన్న ఒక వీడియోని చూపించి చాలా వెకిలిగా అసహ్య పద జాలం తో కామెంట్స్ చేశారు. ఇక ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో అది చూసిన హీరో సాయి ధరమ్ తేజ్ చిన్న పిల్లల తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడే వ్యక్తులు సమాజం లో చాలా మంది ఉంటారు.

    మీ పిల్లలను మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటూనే, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడే వాళ్ల మీద తప్పకుండా మీరు చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం పట్టివిక్రమార్క, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గార్లకు ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఇక ఆయన ట్వీట్ కి స్పందించిన రేవంత్ రెడ్డి ఆ యూట్యూబర్లు ఏం చేశారో నేను చూశాను. వాళ్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం మా గవర్నమెంట్ లో ఆడవాళ్ళకు గానీ చిన్నపిల్లలకు గానీ ఎవ్వరికీ ఎలాంటి హానీ కలగకుండా చూసుకుంటాం అంటూ ఆయన ట్వీట్ చేశారు.

    ఈ విషయం మీద సిఎం స్పందించడం ఒక రకంగా మంచి విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న పిల్లల మీద ఎలాంటి అఘయిత్యపు చర్యలు జరుగుతున్నాయో మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇక వీళ్ళు చేసిన వీడియోలు అలాంటివారిని ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ ఛానల్ ని కూడా బ్లాక్ చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు…