AP CM Chandrababu Naidu Delhi Visit: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సదస్సుకు హాజరవుతున్నారు. ఇదే కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం వెళ్తున్నారు. ప్రస్తుతం జైపూర్ లో ఓ వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు.. అక్కడి నుంచి ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీలోనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలను టెక్నాలజీకి హాఫ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. అనేక సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకొనున్నారు.
* ఏపీ సీఎం చంద్రబాబు ఏఐ యాక్సిలేటర్స్, ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రూప్ అనే అంశంపై అస్సాం సీఎం బిశ్వకర్మ, కేంద్రమంత్రి జితిన్ ప్రసాద లతో సమావేశం అవుతారు. అటు తరువాత ఏఐ, క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాలపై వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఒప్పందం చేసుకొనున్నారు.
* పది లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించేలా ఐబీఎం, క్వాంటం ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు కేంద్రం ఏర్పాటుకు యూనిసీస్ సంస్థతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎస్ఐఈఎల్ ఐటి తో ఏపీ ప్రభుత్వం ఎంవో యూత్ చేసుకోనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటుకు ఐఐటి మద్రాస్ తో మరో ఒప్పందం చేసుకుంది. దీనికి తోడు ఎన్ వీడియా భాగస్వామ్యంతో ఏఐ లివింగ్ లాబ్స్ ఏర్పాటు పై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. క్వాంటేలా ఇంకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీధర్ గాంధీతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ఏఐ ద్వారా పోటీ తత్వం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈవో బోర్జ్ బ్రెండే తో సమావేశం అవుతారు చంద్రబాబు. మొత్తానికి అయితే సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతారు.