Sivatmika Rajasekhar: స్టార్ శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియా పోస్ట్స్ కాకరేపుతున్నాయి. హాట్ ఫోజులతో అమ్మడు మైండ్ బ్లాక్ చేస్తున్నారు. ఈ తెలుగు భామ గ్లామర్ షో కొంచెం హద్దు మీరినట్లే ఉంది. రాజశేఖర్-జీవితల సినీ వారసురాలిగా శివాత్మిక సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. 2019లో దొరసాని చిత్రంలో హీరోయిన్ గా మారారు. పీరియాడిక్ ట్రాజిక్ లవ్ డ్రామాగా దొరసాని తెరకెక్కింది. పేదవాడి ప్రేమలో పడిన దొర కూతురుగా శివాత్మిక అద్భుత నటన కనబరిచారు. ఫస్ట్ మూవీతోనే నటిగా సత్తా చాటింది.

దొరసాని మూవీతో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా వెండితెరకు పరిచయం కావడం విశేషం. దొరసాని పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పెద్ద బ్యానర్స్ ప్రమోట్ చేసిన ఈ చిత్రం కమర్షియల్ గా ఆడలేదు. ఇటీవల శివాత్మిక తమిళ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.

నితమ్ ఒరు వానమ్ చిత్రంలో శివాత్మిక నటించారు. తెలుగులో ఈ చిత్రం ఆకాశం టైటిల్ తో విడుదలైంది. స్టార్ క్యాస్ట్ లేకపోవడంతో ఈ చిత్రాన్ని మన ప్రేక్షకులు పట్టించుకోలేదు. దీంతో శివాత్మిక మరోసారి నిరాశ ఎదురైంది. పరిశ్రమకు వచ్చి మూడేళ్లు అవుతున్నా ఆమెకు ఇంకా బ్రేక్ రాలేదు.
అయితే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. రంగమార్తాండ, పంచతంత్రం చిత్రాల్లో శివాత్మిక నటించారు. దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం వంటి సీనియర్ నటులు రంగమార్తాండ మూవీలో నటిస్తున్నారు. యాంకర్ అనసూయ సైతం ఓ కీలక రోల్ చేస్తున్నారు.

ఇక పంచతంత్రం మూవీ డిసెంబర్ 9న విడుదల కానుంది. దర్శకుడు హర్ష పులిపాక తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్ర ఖని ఈ చిత్రంలో నటించారు. నిజ జీవిత కథలు ఆధారంగా పంచతంత్రం తెరకెక్కింది. ఈ రెండు చిత్రాలు తనకు ఫేమ్ తెస్తాయని శివాత్మిక నమ్ముతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో అందాల విందుకు తెరలేపుతున్నారు.