https://oktelugu.com/

Sudigali Sudheer: శివాజీ కూతురిని కూడా వదలని సుడిగాలి సుధీర్… తండ్రి ముందే అలాంటి చేష్టలు! వీడియో వైరల్

Sudigali Sudheer: సుధీర్ పై పంచులు వేశాడు శివాజీ. అన్నా .. ఆడియన్స్ కి నా గురించి ఏదైనా చెప్పు అని సుడిగాలి సుధీర్ శివాజీని(Sivaji) అడిగాడు. దీంతో శివాజీ... నీకేంటి సుధీర్ అందగాడివి...

Written By:
  • S Reddy
  • , Updated On : June 4, 2024 / 03:42 PM IST

    Sivaji warning to Sudigali Sudheer

    Follow us on

    Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కొంత గ్యాప్ తర్వాత తిరిగి బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం యాంకర్ గా పలు షోలు చేస్తున్నాడు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో సర్కార్ సీజన్ 4 యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ పేరుతో మరో షో చేస్తున్నాడు. అయితే సర్కార్ 4 లేటెస్ట్ ప్రోమో ఆసక్తికరంగా ఉంది. ఇందులో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ శివాజీ, నయని పావని, రతిక రోజ్, టేస్టీ తేజ గెస్టులుగా వచ్చారు.

    రావడంతోనే సుధీర్ పై పంచులు వేశాడు శివాజీ. అన్నా .. ఆడియన్స్ కి నా గురించి ఏదైనా చెప్పు అని సుడిగాలి సుధీర్ శివాజీని(Sivaji) అడిగాడు. దీంతో శివాజీ… నీకేంటి సుధీర్ అందగాడివి, మామూలు స్పీడ్ కాదు అంటూ సుడిగాలి సుధీర్ పై ప్రశంసలు కురిపించాడు. అన్నా అలాగే రెండు జోక్స్ కూడా చెప్పు అని సుడిగాలి సుధీర్ అడిగాడు. ఇప్పుడు చెప్పింది జోక్సే కదా అని శివాజీ పంచ్ వేసాడు. ఆ తర్వాత బుర్ర ఉన్న తెలివైన వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోవచ్చు అని సుధీర్ చెప్పాడు.

    Also Read: Hansika: హీరోయిన్ హన్సికను లైన్లో పెట్టే పనిలో హైపర్ ఆది… వచ్చీ రావడం తోనే మొదలెట్టేశాడుగా!

    కామన్ సెన్స్ లేని వాళ్ళు ఇక్కడ ఉంటారు అని శివాజీ సెటైర్లు వేశాడు. ఇక తర్వాత నయని పావని షోలోకి ఎంట్రీ ఇస్తుంది. నయని పావని(Nayani Pavani) ‘ దొరికినంత దోచుకో ‘ పాటకి సుధీర్ తో కలిసి స్టెప్పులు వేసింది. అనంతరం నయని ని సుడిగాలి సుధీర్ వెల్కమ్ అంటూ హగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో నయని ని తప్పించి శివాజీ దూరి సుధీర్ కి హగ్ ఇస్తాడు. అసలు ‘ దొరికినంత దోచుకో ‘ పాటకి మీనింగ్ ఏంటో తెలుసా అని నయని తో సుధీర్ పులిహోర కలపడానికి ట్రై చేస్తాడు.

    Also Read: Indraja: జబర్దస్త్ షో నుంచి ఇంద్రజ అవుట్.. కారణం ఆమె

    ఇంతలో శివాజీ కలగజేసుకుని ‘ పగిలిపోద్ది ‘ అంటూ సుధీర్ కి వార్నింగ్ ఇస్తాడు. నయని పావని శివాజీలో ఫాదర్ ని చూసుకుంటున్న సంగతి తెలిసిందే. నయని పావని కి తండ్రి లేరు. బిగ్ బాస్ ద్వారా తనకు శివాజీ రూపంలో నాన్న దొరికారని నయని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇక శివాజీ కూడా నయని పావనిని కన్న కూతురిలా భావిస్తాడు. ఆ విధంగా నయని పావని- శివాజీ తండ్రీ కూతుళ్లు అయ్యారన్న మాట. సర్కార్ లేటెస్ట్ ప్రోమో చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. వచ్చే శుక్రవారం ఆహాలో ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.