Homeఆంధ్రప్రదేశ్‌Bandla Ganesh: జబర్దస్త్‌ పిలుస్తోంది..రా.. కదలిరా’.. రోజాపై బండ్లన్న సెటైర్లు!

Bandla Ganesh: జబర్దస్త్‌ పిలుస్తోంది..రా.. కదలిరా’.. రోజాపై బండ్లన్న సెటైర్లు!

Bandla Ganesh: సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ ఫలితాలు అత్యంత ఉత్కంఠ రేపాయి. ఎవరికీ అంతు చిక్కని ఫలితాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కూడా పూర్తిగా తారుమారయ్యాయి. ఇక్కడ టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి ఘన విజయం సాధించింది. అధికార వైసీపీని చిత్తు చేసింది. మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్‌ నాయకులు అంతా ఓడిపోయారు.

ఓటమి అంగీకరించిన రోజా..
ఇక నగిరి నుంచి పోటీ చేసిన రోజా రెండుసార్లు విజయం సాధించింది. జగన్‌ సర్కార్‌లో రాష్ట్ర సాంస్కృతిక, టూరిజం, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు నగిరి నుంచి పోటీ చేసిన రోజా ఈసారి చిత్తుగా ఓడిపోయారు. హ్యాట్రిక్‌ గెలుపును ఆశించిన నటి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. కౌంటింగ్‌ ప్రారంభమయినప్పటి నుంచే టీపీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏరౌండ్‌ లోనూ రోజాకు ఆధిక్యంలోకి రాలేకపోయింది. దీంతో అనుచరులతో కలిసి ఆమె తిరుపతి కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

ఎక్స్‌లో పోస్టు..
తన ఓటమిని అంగీకరిస్తూ రోజా సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. చిరునవ్వుతో ఉన్న తన ఫొటో పెట్టి ‘భయాన్ని విశ్వాసంగా.. ఎదురు దెబ్బలను మెట్లుగా మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునేవాళ్లే శక్తివంతమైన వ్యక్తులుగా మారతారు’ అని క్యాప్షన్‌ పెట్టారు.

బండ్ల గణేశ్‌ సెటైర్లు..
ఇక ఒక ఓటమిని అంగీకరించి కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రోజాపై కాంగ్రెస్‌ నేత బండ్ల గణేశ్‌ కీలక కామెంట్లు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈటీవీలో జబర్దస్‌ జడ్జిగా రోజా పనిచేశారు. దాదాపు పదేళ్లు ఆమె ఈ ప్రోగ్రాం చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో మళ్లీ జబర్దస్త్‌ పిలుస్తోంది రా.. తరలిరా అంటూ నిర్మాత, నటుడు, కాంగ్రెస్‌ నాయకుడు బండ్ల గణేశ్‌ వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు రోజా ఫొటోతో ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

రాజకీయాల్లో బద్ధ శత్రువులు..
రోజా, బండ్ల గణేశ్‌ ఇద్దరూ సినిమా రంగానికి చెందినవారే. అయితే రాజకీయాల్లో మాత్రం ఇద్దరూ బద్ధ శ్రతువులు. పలు సందర్భాల్లో ఇద్దరూ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా బండ్ల గణేశ్‌ చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version