https://oktelugu.com/

Siva Raj Kumar: అప్పూ నా పక్కనే ఉండి శివన్న అని ప్రేమగా పిలుస్తున్నట్టుంది : శివరాజ్ కుమార్

Siva Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మన మధ్య లేరు అనే వార్తను ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఇంకా జీర్ణించుకో లేకపోతున్నారు. ఆయన అక్టోబర్ 29 న పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. పునీత్ లేని లోటు కేవలం కర్ణాటక లోని నటులకే కాక సినీ ఇండస్ట్రి లోని అందరికీ తీరని లోటు అని చెప్పాలి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ… తనదైన శైలిలో ఎంతో […]

Written By: , Updated On : November 28, 2021 / 08:04 PM IST
Follow us on

Siva Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మన మధ్య లేరు అనే వార్తను ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఇంకా జీర్ణించుకో లేకపోతున్నారు. ఆయన అక్టోబర్ 29 న పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. పునీత్ లేని లోటు కేవలం కర్ణాటక లోని నటులకే కాక సినీ ఇండస్ట్రి లోని అందరికీ తీరని లోటు అని చెప్పాలి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ… తనదైన శైలిలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు పునీత్. చిన్న వయసులోనే తమ అభిమాన హీరో చనిపోయాడంటే ఇప్పటికీ ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. ఈ మేరకు పునీత్ రాజ్ కుమార్ అన్న శివ రాజ్ కుమార్ కూడా అందరికి తెలిసిందే. కన్నడ నాట స్టార్ హీరోల్లో ఒకరైన శివన్న తమ్ముడి లేని లోటును మర్చిపోలేకపోతున్నారు. ఆయన మరణించినప్పటి నుంచి అంత్యక్రియలు ముగిసే వరకు అన్నీ తానై ఉండి కన్నీటి పర్యంతం అవుతూనే తమ్ముడికి తుది వీడ్కోలు పలికారు.

siva raj kumar emotional post about puneeth raj kumar

ఇప్పుడు తాజాగా శివ రాజ్ కుమార్ చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో కక్కర్లు కొడుతుంది. పునీత్‌ మరణాన్ని ఇప్పటికీ నేనింకా నమ్మలేక పోతున్నాను. అప్పూ నా పక్కనే ఉన్నట్టు.. శివన్న అని ప్రేమగా పిలుస్తున్నట్టు అనిపిస్తోంది. రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా అర్థం కావడం లేదు. ఈ బాధ నుంచి బయటకు రావడానికి వర్క్‌పై శ్రద్ధ పెడుతున్నాను. అయినప్పటికీ.. ఎక్కడకి వెళ్లినా పునీత్‌ ఫొటోలే కనిపిస్తున్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ కన్నీళ్లు ఆగడం లేదు. అందుకే వాటిని చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. తర్వాత తేరుకొని.. జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా ఈ భూమిని వీడి వెళ్లాల్సిందే అనే జీవిత సత్యాన్ని గుర్తు తెచ్చుకొని గుండె నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. పునీత్‌ సతీమణి అశ్వినీ, ఇద్దరు కుమార్తెలకు నాకు చేతనైనంత సాయం చేస్తూనే ఉంటాను” అని శివరాజ్‌కుమార్‌ తెలిపారు.