Homeఎంటర్టైన్మెంట్Gamanam Movie: "గమనం" చిత్రం నుంచి సాంగ్ విడుదల చేసిన అక్కినేని నాగ చైతన్య...

Gamanam Movie: “గమనం” చిత్రం నుంచి సాంగ్ విడుదల చేసిన అక్కినేని నాగ చైతన్య…

Gamanam Movie: లేడి డైరెక్టర్ సుజనా రావు పలు ఉపకథల సమ్మేళనంగా తెరకెక్కించిన చిత్రం” గమనం”ఈ సినిమాలో శ్రియ, ప్రియాంక జవాల్కర్‌, శివ కందుకూరి, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలో నటించారు.క్రియ ఫిల్మ్‌ క్రాప్‌, కాళీ ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా రమేష్‌ కరుటూరి, వెంకీ పుషదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ నిర్మించారు ఇళయరాజా సంగీతం అందించారు. విభిన్నమైన పాత్రలతో త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఒక పాటను విడుదల చేశారు చిత్రం బృందం.

akkineni naga chaitanya released a song from gamanam movie

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న చిత్రం ‘గమనం’ సుజనారావు దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం డిసెంబరు 10న థియేటర్ లో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో తాజాగా ‘గమనం’ నుంచి సాంగ్‌ ఆఫ్‌ లైఫ్‌ పేరుతో ఓ సరికొత్త పాటను విడుదల చేశారు అక్కినేని యంగ్ సామ్రాట్ నాగచైతన్య. ఆయన మాట్లాడుతూ …ఈ పాట చాలా బాగుందని ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించారని తప్పకుండా ఈ సినిమా హిట్‌ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఓ చెవిటి ఇల్లాలు.. ఓ యువజంట ప్రేమకథ.. మ‌రో అనాథ‌ల ప్రయాణమే ‘గమనం’ మూవీ అని చెప్పొచ్చు.  గృహిణి పాత్రలో శ్రియ తనదైన శైలిలో అద్భుతంగా నటించింది. కట్టుకున్న భ‌ర్త దుబాయ్ వెళ్లిపోతే అత‌ని రాక‌కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. భావోద్వేగభరితమైన కథాంశాలతో సాగే ఈ చిత్రంలో శ్రియ దివ్యాంగురాలి పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌కు ప్రేక్షక అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ సినిమా హిందీ ,తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version