https://oktelugu.com/

Actreess Mehreen: మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన మెహరీన్… ఆ సీనియర్ హీరో ఎవరంటే ?

Actreess Mehreen: టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్.. కెరీర్ ఆరంభంలో మంచి హిట్స్ అందుకుంది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది. రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకొని కెరీర్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తోన్న మెహ్రీన్ తాజాగా మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. అది కూడా సీనియర్ హీరో నాగార్జునతో అని తెలుస్తోంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెతికి పట్టుకోవడం చాలా […]

Written By: , Updated On : November 28, 2021 / 07:47 PM IST
Follow us on

Actreess Mehreen: టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్.. కెరీర్ ఆరంభంలో మంచి హిట్స్ అందుకుంది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది. రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకొని కెరీర్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తోన్న మెహ్రీన్ తాజాగా మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. అది కూడా సీనియర్ హీరో నాగార్జునతో అని తెలుస్తోంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెతికి పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తోన్న ‘ఘోస్ట్’ సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను తీసుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో అమలాపాల్ ను సంప్రదించారు.

actress mehreen got chance to act with king nagarjuna

అయితే ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని దీంతో నిర్మాతలు ఆమెకి బదులు మరో హీరోయిన్ కోసం వెతికారు. ఈ క్రమంలో మెహ్రీన్ ను సంప్రదించగా ఆమె కూడా ఎక్కువ మొత్తాన్నే అడిగిందట. ఒక్కో సినిమాకి అరవై లక్షల చొప్పున తీసుకునే మెహ్రీన్ దీనికోసం మాత్రం కోటికి దగ్గర్లో అడిగిందని టాక్. మొదట్లో వెనకడుగు వేసిన నిర్మాతలు ఇప్పుడు ఆమె అడిగినంత ఇవ్వడానికి ముందుకొచ్చారని సమాచారం. ఇప్పటి వరకు యంగ్ హీరోలతో ఆడిపాడిన మెహ్రీన్ ఇప్పుడు సీనియర్ హీరోతో జోడీ కట్టడానికి రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.