Homeఅప్పటి ముచ్చట్లుJaggayya: 'నేనెంత చదివానో తెలుసా..?' అని ఆ మహా నటుడు.. !

Jaggayya: ‘నేనెంత చదివానో తెలుసా..?’ అని ఆ మహా నటుడు.. !

Siva Nageswara Rao Shares An Unforgettable Moment With JaggayyaJaggayya: ‘జగ్గయ్య’.. తెలుగు సినీ లోకంలో ‘కంచు కంఠం’ అనే పదానికి పర్యాయ పదం అయ్యారు. భాష పై జగ్గయ్య (Jaggayya) గారికి ఉన్న పట్టు అమోఘం అని ఆత్రేయగారే ఓ స్టేజ్ పై సుదీర్ఘ స్పీచ్ ఇచ్చారు. నిజానికి జగ్గయ్య గారు కెరీర్ తొలినాళ్లలో హీరోగా నటించారు. కానీ అదృష్టం కలిసి రాలేదు. దాంతో ఆయన ఆ తర్వాత సైడ్ పాత్రలలో సహాయ నటుడిగా నటించాల్సి వచ్చింది. అయితే, ఆయన ఆ పాత్రల్లో కూడా అద్భుతంగా రాణించారు.

అయితే, జగ్గయ్య గారితో తనకు జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను దర్శకుడు శివ నాగేశ్వర్ రావు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జగ్గయ్య గారు షూటింగ్ పూర్తయ్యాక వెళ్లిపోతూ ఉంటే.. శివ నాగేశ్వర్ రావు తడబడుతూ జగ్గయ్య దగ్గరకు వెళ్లి ‘మీరు చెప్పిన డైలాగులో ఐ కాంట్ బదులు ఐ కేంట్ అని ఓ పదం తప్పు పలికారు అన్నారట.

ఆ మాటకు జగ్గయ్య గారు ‘నువ్వెంత చదువుకున్నావు’ అని అడిగారు. శివ నాగేశ్వర్ రావు భయపడుతూనే ‘B.com’ అని చెప్పగానే, ‘నేనెంత చదివానో తెలుసా.. MA HONOURS, దాన్ని కేంట్ అనే చదవాలి’ అని జగ్గయ్య గారు గంభీరంగా చెప్పారు. శివ నాగేశ్వర్ రావు కూడా తగ్గకుండా.. ‘కానీ ప్రేక్షకులలో 90% శాతం నాలాంటి వాళ్ళే ఉంటారు సర్’ అని చెప్పగా..

జగ్గయ్య గారు నవ్వుతూ.. ‘కానీ నేను తప్పు చెపితే మిగిలిన వారు జగ్గయ్య అంత చదివి కూడా తప్పు చెప్పారు అంటారు. కాబట్టి నేను చెప్పిందే ఉంచండి’ అని నవ్వుతూ వెళ్లిపోయారట. ఈ సంఘటనతో జగ్గయ్య గారికి అంకిత భావం నటనలోనే కాదు, జ్ఞానంలోనూ ఉందని అర్ధమవుతుంది. అన్నట్టు జగ్గయ్య గారి గురించి నేటి తరానికి తెలియని విషయాలు ఏమిటో తెలుసా.. ?

జగయ్య గారు గొప్ప చిత్రకారుడు కూడా. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేసరికి, జగ్గయ్య గారి వయసు 20 ఏళ్లు.. ఆ వయసులోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తెనాలిలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. జగ్గయ్య గారు కొన్నాళ్లు పత్రికా రంగంలో కూడా ఉన్నారు. దేశాభిమాని పత్రికలో ఆయన విలేఖరిగా కూడా పనిచేశారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper