Manchu Vishnu Comments On Rajinikanth: రజనీకాంత్(Super Star Rajinikanth) కి మన టాలీవుడ్ లో అత్యంత ఆప్త మిత్రుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మోహన్ బాబు(Manchu Mohan Babu) అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఒకే తల్లి కడుపునా పుట్టకపోయిన మేమిద్దరం అన్నదమ్ములం లాగానే ఉంటాము అంటూ మోహన్ బాబు ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. ఒకరినొకరు ‘ఎరా’ అని పీల్చుకునేంత చనువు వీళ్లిద్దరి మధ్య ఉన్నది. అయితే మోహన్ బాబు కుటుంబం తో అంతటి సాన్నిహిత్యం ఉన్న రజనీకాంత్, మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa Movie) లో ఎందుకు లేడనే సందేహం ప్రేక్షకుల్లో ఉంది. ఈ చిత్రం వివిధ భాషల నుండి బడా సూపర్ స్టార్స్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ నుండి రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుండి మోహన్ లాల్ వంటి వారు ఈ చిత్రంలో నటించారు.
Also Read: కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. గులాబీ పార్టీలో కలకలం! ఏం జరగనుంది?
ఇంతమంది ప్రముఖులు ఉన్నప్పుడు రజనీకాంత్ ని ఎందుకు తీసుకోలేదు అని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మంచు విష్ణు ని యాంకర్ అడుగుతారు. దానికి ఆయన సమాధానం చెప్తూ ‘రజనీకాంత్ గారి కోసం మేము ఒక క్యారక్టర్ రాసుకున్నాం. నాన్న గారి కాంబినేషన్ లో ఆ క్యారక్టర్ ఉంటుంది. కానీ సినిమా కథకు సంబంధం లేకుండా అనవసరం ఆ సన్నివేశం ఉందని, లెంగ్త్ చాలా ఎక్కువగా ఉందని మా రచయితలు చెప్పడంతో ఆ సీక్వెన్స్ ని సినిమా నుండి తొలగించాము’ అంటూ చెప్పుకొచ్చాడు విష్ణు. ఒకవేళ ఈ సినిమాలో రజనీకాంత్ ఉండుంటే కచ్చితంగా తమిళ మార్కెట్ లో చాలా మంచి రీచ్ ఉండేది. ముందుగానే రజనీకాంత్ కోసం ఒక క్యారక్టర్ ని రాసుకొని ఉండుంటే బాగుండేది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీ నుండి ఈ చిత్రం లో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించాడు.
అయితే ఈ చిత్రం రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, ఆయన ఎందుకు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడో సినిమాని చూసిన రోజు మీ అందరికీ అర్థం అవుతుందని చెప్పుకొచ్చాడు. ఇందులో ప్రభాస్ రుద్రా అనే క్యారక్టర్ చేసాడు. ఆయనకు మేము రెండు పవర్ ఫుల్ పాత్రలు ఆఫర్ చేశామని, ప్రభాస్ వాటిల్లో రుద్రా క్యారక్టర్ ని ఎంచుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27 న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్స్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. మంచు విష్ణు ఈ సినిమా తన కెరీర్ ని మలుపు తిప్పుతుంది అనే బలమైన నమ్మకం తో ఉన్నాడు. ఆ నమ్మకం ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.