Harihara Veeramallu Release: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా గడ్డు పరిస్థితి నడుస్తుందనే చెప్పాలి. ప్రేక్షకులెవ్వరు సినిమాలను చూడడానికి థియేటర్లకు రావడం లేదు. కారణం ఏంటి అంటే ఓటిటి లు ఎక్కువైపోవడం, సినిమా రిలీజ్ అయిన వారం రోజులకే ఓటిటిల్లోకి వస్తున్నాయి. దానివల్ల సినిమాలను చూడాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వీకెండ్స్ లో టీవీలో ఫ్యామిలీతో కలిసి ఓటిటి ప్లాట్ ఫామ్ లో సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు…
Also Read: కన్నప్ప’ లో రజనీకాంత్ పాత్రపై మంచు విష్ణు ఆసక్తికరమైన వ్యాఖ్యలు!
పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu)సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వస్తున్నప్పటికి ప్రస్తుతం ఆ సినిమా చాలా కష్టాలను ఏడుకోవాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుంది. ఇక ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం థియేటర్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. థియేటర్లోకి ప్రేక్షకులు వచ్చి సినిమాలను చూసే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి ఈ సినిమాలను తీసుకునే పరిస్థితి అయితే లేదు… కాబట్టి చాలా తక్కువ రేట్ కి అమ్మే పరిస్థితిలో ప్రొడ్యూసర్ అయితే లేడు. మరి ఇలాంటి సందర్బంలో హరి హర వీరమల్లు సినిమాకి భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ప్రొడ్యూసర్ సొంతంగా ఈ సినిమాని రిలీజ్ చేసుకోవాలి అంటే మాత్రం అతనికి భారీగా నష్టం వాటిల్లే అవకాశాలైతే ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో ఎందుకని ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని కొనడం లేదు. ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్ కి రావడం మానేశారు.
అందువల్ల థియేటర్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇప్పుడు ఈ సినిమాని ఎక్కువ రేటుకి కొనుగోలు చేస్తే పాజిటివ్ టాక్ వస్తే పర్లేదు కానీ, నెగెటివ్టాక్ వచ్చినట్లయితే థియేటర్లకి ఎవరూ రారు. దానివల్ల ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.
ఇక ప్రొడ్యూసర్ సాహసం చేసి ఎంతకి కొంతకు ఇచ్చేద్దాం అని అనుకున్నప్పటికీ కనీసం అడ్వాన్సు ఇచ్చే పరిస్థితిలో కూడా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం అనే చెప్పాలి…ఇక ఈ విషయం మీద గత కొద్దిరోజుల నుంచి థియేటర్లో ఎగ్జిబిటర్లు థియేటర్లు క్లోజ్ చేసే విషయం మీద సరైన క్లారిటీ కి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీని మీద సరైన నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు. ఈ మధ్య పెద్ద సినిమాలు ఏమీ రాలేదు.
కాబట్టి పెద్దగా ఇబ్బందులైతే ఎదురవ్వలేదు. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్నా నేపథ్యంలో థియేటర్ల ఎగ్జిబ్యూటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేస్తూ వాళ్ళు ఈ సినిమాను కొనడానికి ఇష్టపడటం లేదు…చూడాలి మరి హరిహర వీరమల్లు మూవీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది…