Tamara Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలలో “సితార ఎంటర్టైన్ మెంట్స్ కూడా ఒకటి. ప్రేమమ్, బాబు బంగారం, శైలజ రెడ్డి అల్లుడు, జెర్సీ, భీష్మ, వరుడు కావలెను వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ సంస్థ. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా జంటగా నటిస్తున్న “భీమ్లా నాయక్ ” చిత్రాన్ని కూడా సితార సంస్థే నిర్మిస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు చేయబోయే సినిమా గురించి ఇండస్ట్రి వర్గాల్లో బాగా చర్చించుకుంటున్నారు.

ఓ అంతర్జాతీయ సినిమాను ఫ్రెంచ్ భాగస్వామ్యంతో కలిసి నిర్మించనున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు సితార అధినేతలు. కాగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అలానే ఈ మూవీకి “తామర” అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. సినిమాటోగ్రాఫర్ గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు రవి కె.చంద్రన్. పలు సినిమాలతో డైరెక్టర్ గానూ ఆయన సక్సెస్ సాధించారు.
We're proud to announce our new film titled '#Tamara' with the magical lensman @dop007✨
Our first International Film with an exciting Indo-French Collaboration like never before!
Produced by @vamsi84
Stay tuned for more details! pic.twitter.com/i3yTijQrp5
— Sithara Entertainments (@SitharaEnts) November 5, 2021
మళ్ళీ ఇప్పుడు ఈ మూవీతో దర్శకుడిగా మారుతున్నారు రవి కె చంద్రన్. ఈ ” తామర” చిత్రానికి ఆయనే డైరెక్షన్ చేయనున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఫీమేల్ ఒరియంటెడ్ సినిమాగా అనిపిస్తుంది. ఈ అంతర్జాతీయ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రవి భీమ్లా నాయక్ సినిమాకు సినిమాట్రోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.