Homeఎంటర్టైన్మెంట్Jai Bhim: "జై భీం" సినిమాలో సినతల్లిగా నటించింది ఎవరో తెలుసా?

Jai Bhim: “జై భీం” సినిమాలో సినతల్లిగా నటించింది ఎవరో తెలుసా?

Jai Bhim: ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతున్న సినిమా ఏదైనా ఉందంటే.. అది “జై భీం”. తమిళనాడు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కె.చంద్రు నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. తమిళ స్టార్‌ హీరో సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీ.. దీపావళి కానుకగా అమెజాన్‌ ఓటీటీలో విడుదలై హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఈ భూమ్మీద అందరూ సమానమేనని, సమన్యాయం దక్కాల్సిందేననే సందేశాన్నిచ్చిన ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Jai Bhim
ఒక కేసులో అరెస్టై కనిపించకుండా పోయిన భర్త ఆచూకీ కోసం, తర్వాత అతడి మరణం వెనకున్న కారణం తెలుసుకునేందుకు ఓ గర్భిణీ చేసిన పోరాటమే ఈ సినిమా. ఈ రియల్ స్టోరీ అందరినీ కట్టి పడేస్తొంది. ఈ జై భీమ్‌లో.. భర్త కోసం పోరాటం చేసిన గిరిజన మహిళ ‘సినతల్లి’ పాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. దీంతో.. ఆ నటి ఎవరు? అంటూ.. అందరూ సెర్చ్‌ చేస్తున్నారు. మరి, ఆమె ఎవరు? ఆమె చరిత్ర ఏంటన్నది చూద్దాం.
Lijomol Jose
‘సినతల్లి’ పాత్ర పోషించిన నటి పేరు లిజోమోల్ జోస్. ఈమె ఈ మలయాళ నటి. కేరళలో ఉన్నత మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో డిగ్రీ చేసిన ఈమె.. యూనివర్శిటీ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ లైబ్రరీ సైన్స్‌లో మాస్టర్స్‌ చదివింది. ఆ తర్వాత ఓ చానల్‌లో పని చేసింది. ఈ క్రమంలోనే.. స్నేహితురాలి సూచన మేరకు సినిమా ఆడిషన్స్‌కు హాజరైంది.

మూడు ఆడిషన్స్‌ తర్వాత ఫహద్‌ ఫాజిల్‌ సినిమాలో చాన్స్ కొట్టేసింది. ‘మహాశింబే ప్రతీకారం’ మూవీతో ఈమె కోలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2016లో వచ్చిన ‘రిత్విక్‌ రోషన్‌’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘హనీ బీ 2.5’ సినిమాతో స్టార్‌ నటిగా ఎదిగింది. ఇటీవల.. హీరో సిద్దార్థ్‌ నటించిన తమిళ చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చాయ్’లోనూ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ తెలుగులో… “ఒరేయ్ బామ్మర్ది” పేరుతో రిలీజ్ అయ్యింది.
Lijomol Jose in jai bhim
Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ నుంచి మరో బిగ్ అప్డేట్… ఈసారి డాన్స్ తో రఫ్ఫాడించనున్న ఎన్టీఆర్, చరణ్

ఈ మూవీలో ఆమె నటనను చూసిన దర్శకుడు జ్ఞానవేల్‌.. ‘జై భీమ్‌’లో ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో డీ-గ్లామర్‌ రోల్‌ లో అద్భుతంగా నటించింది లిజోమోల్. ఈ పాత్ర కోసం తనను తాను మేకోవర్‌ చేసుకున్న తీరు అమోఘమనే చెప్పాలి. ఎమోషన్ సన్నివేశాల్లో గ్లీజరిన్‌ లేకుండానే ఏడ్చిందట. ఈ విధంగా.. అటు గ్లామర్ రోల్ లోనూ.. ఇటు డీ గ్లామర్ గానూ మెప్పించిన లిజోమోల్.. అవకాశాలు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.

Also Read: Avika ghor: చిన్నారి పెళ్లి కూతురు జీవితాన్ని నాశనం చేసింది ఎవరు?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular