Sitaare Zameen Par 2025 First Review: ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే మనకి గుర్తుకు వచ్చే మొదటి ఇద్దరి హీరోల పేర్లలో అమీర్ ఖాన్(Aamir Khan) పేరు కచ్చితంగా ఉంటుంది. 2008 వ సంవత్సరం గజినీ నుండి 2016 వ సంవత్సరం ‘దంగల్’ వరకు బాలీవుడ్ లో అమీర్ ఖాన్ సినిమాలకు అమీర్ ఖాన్ మాత్రమే పోటీ. ఆయన రికార్డ్స్ ని ఆయన మాత్రమే బద్దలు కొట్టేవాడు. కానీ ‘దంగల్ ‘ తర్వాత అమీర్ జోరు బాగా తగ్గిపోయింది. ఈ చిత్రం తర్వాత ఆయన నుండి ‘సీక్రెట్ సూపర్ స్టార్’ అనే చిత్రం వచ్చింది, మన దేశంలో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది కాలం, చైనా దేశం లో మాత్రం వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ గా నిల్చింది. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన నుండి ‘తగ్స్ ఆఫ్ హిందూస్తాన్’,’లాల్ సింగ్ చద్దా’ వంటి చిత్రాలు వచ్చాయి.
ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ఈ గ్యాప్ లో మన సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు విశ్వరూపం చూపించేసారు. దీంతో అమీర్ ఖాన్ మళ్ళీ కం బ్యాక్ ఇవ్వడానికి ప్రస్తుత తరం లో ఉన్న జనాల మైండ్ సెట్ ని బాగా గమనించడం నేర్చుకున్నాడు. అలా వాళ్ల ఆలోచనలకు తగ్గట్టుగా, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా, తన కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘తారే జమీన్ పర్’ చిత్రానికి సీక్వెల్ గా ‘సితారే జమీన్ పర్'(Sitare Zameen Par) చిత్రాన్ని తీసాడు. ఈ నెల 20 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో మొదలు అయ్యాయి. అంచనాలు ఈ చిత్రం పై పెద్దగా లేవు కాబట్టి ఓపెనింగ్స్ కష్టమే. కానీ లాంగ్ రన్ లో మాత్రం పాజిటివ్ టాక్ వస్తే దుమ్ము లేచిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో ని నిన్న దుబాయ్ లో కొంతమంది ప్రముఖులకు, మీడియా మిత్రులకు వేసి చూపించారు . వీళ్ళ నుండి ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నేటి తరం యువత ప్రతీ ఒక్కరు కచ్చితంగా థియేటర్స్ కి వెళ్లి చూడతగ్గ సినిమా అట. ప్రతీ ఎమోషన్ హృదయాలకు హత్తుకునే విధంగా ఉంటుందని, ఫన్ తో పాటు, సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయ్యిందట. ఎందుకు పనికిరారు అనుకున్న కొంతమందిని ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి బాస్కెట్ బాల్ లో ఒలింపిక్స్ కి వెళ్లి ఇండియా తరుపున ఆడి గోల్డ్ మెడల్ సంపాదించే క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా వచ్చాయని అంటున్నారు. మరి ఈ రేంజ్ లో సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.