Boyapati Chiranjeevi New Movie Buzz: బోయపాటి శ్రీను(Boyapati Srinu) కేవలం బాలయ్య(Nandamuri Balakrishna) కి మాత్రమే సూట్ అవుతాడు, వేరే ఏ హీరో తో అయినా ఆయన సినిమా చేస్తే డిజాస్టర్ ఫ్లాప్ అవుతుందని ట్రేడ్ లో ఒక టాక్ ఎప్పటి నుండో ఉంది. టాక్ ఏంటి?, అది నిజమే అనుకోండి. ‘భద్ర’, ‘తులసి’, ‘సరైనోడు’ చిత్రాలు మాత్రమే బోయపాటి ఇతర హీరోలతో సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టినది. మిగిలిన స్టార్ హీరోలతో చేసినవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో చేస్తే మాత్రం లెక్కలు మారుతాయి అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చాలా కాలం నుండి బోయపాటి శ్రీను మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట. కానీ ఎందుకో ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం బాలయ్య తో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే చిరంజీవి తో సినిమా మొదలు పెట్టేలా ప్లాన్ చేసుకున్నాడట.
రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి ని కలిసి ఒక కథ ని వినిపించాడట. ఈ కథ చిరంజీవి కి ఎంతో బాగా నచ్చిందని తెలుస్తుంది. ఇందులో బోయపాటి మార్క్ ఓవర్ బిల్డప్ సన్నివేశాలు ఉండవట, చిరంజీవి ని సైలెంట్ గా చూపిస్తూనే, మోస్ట్ వయొలెంట్ ఫీలింగ్ ని రప్పించేలా ఆయన క్యారక్టర్ ని రాసుకున్నాడట. ఉదాహరణకు ‘ఠాగూర్’ చిత్రాన్ని తీసుకోండి. ఇందులో చిరంజీవి క్యారక్టర్ ఆర్క్ ఎలా ఉంటుందో, బోయపాటి శ్రీను తీయబోయే సినిమాలో కూడా అదే విధంగా ఉంటుందట. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ప్రొఫెసర్ క్యారక్టర్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ద్వితీయార్థం నుండి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. గతంలో వీళ్ళు మెగాస్టార్ చిరంజీవి తో ‘భోళా శంకర్’ అనే చిత్రాన్ని నిర్మించారు.
Also Read: Balakrishna And Boyapati: బాలయ్య బోయపాటి లకు ఏమైంది..? ఎడమొఖం పెదమొఖం గా ఉంటున్నారా..?
తమిళంలో సూపర్ హిట్ గా నిల్చిన ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎంతటికి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలే చిరంజీవి తో సినిమా చేయడానికి ముందుకొచ్చారు. కానీ ఈసారి మాత్రం కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి అనే రేంజ్ కసితో ఉన్నారట నిర్మాతలు. చూడాలి మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అనీల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన శ్రీకాంత్ ఓదెల చిత్రానికి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాకనే బోయపాటి శ్రీను సినిమా గురించి ఆలోచిస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని క్రేజీ అప్డేట్స్ బయటకు రానున్నాయి.