https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : ప్రేరణ, యష్మీ స్నేహానికి ఇక బ్రేక్ పడినట్టేనా..? ఇద్దరి మధ్య పుల్లలు పెట్టేసిన సీత, నైనిక!

నిన్న లైవ్ లో కిరాక్ సీత, నైనిక నామినేషన్స్ ని చూసిన ప్రతీ ఒక్కరు యష్మీ ని ఒక పాయింట్ మీద అనవసరం గా టార్గెట్ చేసినట్టు అనిపించింది. ప్రేరణ తన భర్త కోసం కోసం ఎదురు చూస్తున్న సమయంలో 'క్రింజ్' అని అనడాన్ని మీరంతా చూసే ఉంటారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 19, 2024 / 11:03 AM IST

    Prerna and Yashmi's friendship

    Follow us on

    Bigg Boss Telugu 8 :  ప్రతీ వారం లాగా కాకుండా ఈ వారం కాస్త బిగ్ బాస్ భిన్నంగా అలోచించి, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని లోపలకు పిలిచి నామినేషన్ వేయించిన సంగతి తెలిసిందే. ఆదిత్య ఓం, సోనియా, శేఖర్ బాషా, నైనికా, సీత, బెజవాడ బేబక్క మరియు నాగ మణికంఠ వంటి కంటెస్టెంట్స్ లోపలకు వచ్చి హౌస్ మేట్స్ ని నామినేట్ చేసి వెళ్లారు. వీరిలో బెజవాడ బేబక్క, సోనియా, శేఖర్ బాషా నామినేషన్స్ ని నిన్నటి ఎపిసోడ్ లో చూపించారు. మిగిలిన కంటెస్టెంట్స్ కి సంబంధించిన నామినేషన్స్ ని నేటి ఎపిసోడ్ లో చూపించబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే నిన్న లైవ్ లో కిరాక్ సీత, నైనిక నామినేషన్స్ ని చూసిన ప్రతీ ఒక్కరు యష్మీ ని ఒక పాయింట్ మీద అనవసరం గా టార్గెట్ చేసినట్టు అనిపించింది. ప్రేరణ తన భర్త కోసం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ‘క్రింజ్’ అని అనడాన్ని మీరంతా చూసే ఉంటారు.

    ఈ పాయింట్ మీద వీళ్లిద్దరు ఆమెని నామినేట్ చేసారు. ముందుగా నైనిక మాట్లాడుతూ ‘ప్రేరణ నీ స్నేహితురాలు కదా, ఆమె తన భర్త శ్రీపాద్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో నువ్వు క్రింజ్ అని అన్నావు. ఒక స్నేహితురాలి గురించి ఎవరైనా అలా మాట్లాడుతారా?, నీ స్నేహితురాలికి నువ్వు వెన్నుపోటు పొడుస్తావా?’ అని అంటుంది. దానికి యష్మీ కి ఏ సందర్భంలో అనిందో గుర్తు రాక చాలా ఇబ్బంది పడుతుంది. ప్రేరణ కూడా యష్మీ ఇంత మాట అనిందా అని చాలా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సీత వచ్చి ఇదే పాయింట్ మీద యష్మీ ని నామినేట్ చేస్తుంది. అప్పుడు యష్మీ కి జరిగిన విషయం గుర్తుకొచ్చి మాట్లాడుతుంది.

    ఆమె మాట్లాడుతూ ‘నేను శ్రీపాద్ వచ్చినప్పుడు క్రింజ్ అని ఎక్కడా మాట్లాడలేదు. బయట ప్రేరణ, అవినాష్, టేస్టీ తేజ శ్రీపాద్ లాగ నటిస్తూ ఒక స్కిట్ చేస్తూ ఉన్నారు. దానిని లోపల నుండి చూసిన నేను క్రింజ్ అని అన్నాను. అంతే కానీ ప్రేరణ, శ్రీపాద్ క్యూట్ మొమెంట్స్ ని నేను క్రింజ్ అనలేదు’ అని అంటుంది. విష్ణు ప్రియ కూడా ఆ సమయంలో యష్మీ పక్కనే ఉంది కాబట్టి, ఆమె కూడా సాక్ష్యం చెప్తుంది. కానీ ఇదంతా జరిగిన తర్వాత కూడా ప్రేరణ, యష్మీ మాట్లాడుకోలేదు. ఎడమొహం, పెడమొహం లాగానే ఉన్నారు. చూస్తూ ఉంటే అనవసరమైన పాయింట్ ని తీసుకొచ్చి, సీత, నైనిక ప్రేరణ, యష్మీ మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టినట్టు చూసే ఆడియన్స్ కి అనిపించింది. వాస్తవానికి ప్రేరణ యష్మీ వెనుక చేరి ఎన్నో మాట్లాడింది, ఆమె ఎలిమినేట్ అయిపోతుందని అనుకున్నాను అంటూ నబీల్ తో నిన్న మాట్లాడడాన్ని మనమంతా చూసాము. యష్మీ ప్రేరణ ని తన స్నేహితురాలిగా మనస్ఫూర్తిగా నిజాయితితో ఉంది కానీ, ప్రేరణ మాత్రం అలా లేదు, కేవలం ఆమెతో ఫేక్ స్నేహం చేస్తుందని నిన్నటి ఎపిసోడ్ తో అర్థమైంది.