https://oktelugu.com/

Bigg Boss Telugu 8: గౌతమ్ ఆట తీరుని ఒక రేంజ్ లో మెచ్చుకున్న శేఖర్ బాషా..అసూయతో రగిలిపోయిన ప్రేరణ, యష్మీ!

ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా బిగ్ బాస్ హౌస్ లోపలకు పిలిచి, టాప్ 10 కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయించే ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. శేఖర్ బాషా ప్రేరణ, యష్మీ లను నామినేట్ చేసి, వాళ్లిద్దరూ గ్రూప్ గేమ్స్ ఆడుతున్నట్టుగా చెప్తారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 19, 2024 / 10:52 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8:  వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన గౌతమ్ బిగ్ బాస్ జర్నీ ఇప్పటి వరకు ఏ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ కి కూడా సాధ్యం అవ్వని రేంజ్ లో ఉంది. నామినేషన్స్ లోకి వచ్చిన మొదటి వారంలోనే ఎలిమినేట్ అవ్వాల్సిన గౌతమ్, మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవడం వల్ల సేవ్ అవుతాడు. ఈ సంఘటన తర్వాత గౌతమ్ ఎమోషనల్ గా చాలా ఫీల్ అవుతాడు. వారం మొత్తం ఎలిమినేట్ అయ్యే బాధతో గేమ్స్ ఆడడం చాలా కష్టం, కానీ ఆయన ఆ సమయంలో కూడా గేమ్స్ ఆడేందుకు తన వైపు నుండి బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. రెడ్ టీం లోకి ఆయన వెళ్ళినప్పుడు యష్మీ, ప్రేరణ అతన్ని ఎంత తక్కువ చేసి చూసినా కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా గేమ్ ఆడాడు. చివరికి యష్మీ, ప్రేరణ ఇద్దరు కూడా టీం ఓడిపోడానికి గౌతమ్ కారణం అని నిందలు వేసి అతన్ని నామినేట్ కూడా చేస్తారు.

    అయినప్పటికీ గౌతమ్ తగ్గలేదు, చాలా కూల్ గా, కంపోస్డ్ గా గేమ్ ఆడి తన గ్రాఫ్ ని పెంచుకుంటూ వెళ్ళాడు. నేడు ఆయన నిఖిల్ ని సైతం వెనక్కి నెట్టి, అందరికంటే నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు. ఇంకొక్క పాజిటివ్ ఎపిసోడ్ గౌతమ్ కి పడితే టైటిల్ అతనికే అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇదంతా పక్కన పెడితే గౌతమ్ ఎదుగుదల లోపల ఉన్నటువంటి హౌస్ మేట్స్ కి ఎవరికీ నచ్చడం లేదు. ముఖ్యంగా ప్రేరణ అయితే అసూయతో రగిలిపోతుంది. నబీల్, యష్మీ, నిఖిల్ ఇలా ప్రతీ ఒక్కరి దగ్గర గౌతమ్ కి ఎలా ఓట్లు పడుతున్నాయి రా బాబు, వాడు కరెక్ట్ మనిషి కాదు, అంత గేమ్ కూడా ఆడలేదు అంటూ అతని వెనుక చేరి ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంది. వీకెండ్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు మొత్తం గౌతమ్ ని టాప్ లో పెట్టడం ఆమె అసలు జీర్ణించుకోలేక పోతుంది.

    ఇదంతా పక్కన పెడితే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా బిగ్ బాస్ హౌస్ లోపలకు పిలిచి, టాప్ 10 కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయించే ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. శేఖర్ బాషా ప్రేరణ, యష్మీ లను నామినేట్ చేసి, వాళ్లిద్దరూ గ్రూప్ గేమ్స్ ఆడుతున్నట్టుగా చెప్తారు. ఇదంతా పక్కన పెడితే శేఖర్ బాషా గౌతమ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను గౌతమ్ ని నామినేట్ చేయాలనీ అనుకున్నాను. ఎందుకంటే వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లో మిగిలిన ముగ్గురి కంటే తక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నది గౌతమ్ కాబట్టి అని. కానీ అతన్ని నామినేట్ చేయాలంటే ఎదో ఒక కారణం కావలి కదా అని ఎపిసోడ్స్ మొత్తం చూసాను. చూసిన తర్వాత అతని ఆట తీరుకి ఫ్యాన్ అయిపోయాను. ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో అద్భుతంగా ఆడిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది గౌతమ్ మాత్రమే’ అని శేఖర్ బాషా చెప్పుకొస్తాడు. దీనికి పక్కనే ఉన్న యష్మీ, ప్రేరణ అసూయ తో రగిలిపోతారు.