https://oktelugu.com/

Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్ నుంచి “సిరివెన్నెల” చివరి పాట రిలీజ్…

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. ఆయన నటించిన గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడటంతో… ఈ సినిమాపై నాని అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 05:42 PM IST
    Follow us on

    Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. ఆయన నటించిన గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడటంతో… ఈ సినిమాపై నాని అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది.

    sirivennela song released from nani shyam singaroy movie

    Also Read: పరువుతో బన్నీ పోరాటం… అంత ఈజీ కాదు!

    అయితే తాజాగా ఈ సినిమా నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాటను విడుదల చేసింది చిత్ర బృందం. “నెలరాజుని ఇలా రా నీ కలిపింది కదా సిరివెన్నెల ” అంటూ సాగే ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాట వింటుంటే మళ్లీ సిరివెన్నెల పాటలు రావు అనే భావోద్వేగంతో కంట నీరు ఉబుకుతుంది. ఇక శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నాని, సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ ట్రాక్ కు ఈ పాట ముఖ్యం అని తెలుస్తుంది. ఈ సాంగ్ తో సిరివెన్నెల సీతారామశాస్త్రి మరోసారి తనదైన ముద్రను వేసుకున్నారు. అలాగే ఈ సాంగ్ లో హీరో నాని అలాగే సాయి పల్లవి మధ్య కోఆర్డినేషన్ చాలా వర్క్ అవుట్ అయింది. మొత్తానికి ఈ పాట సినిమాపై హైప్ ను పెంచేసింది. సిరివెన్నెల’ పాటకు మిక్కీ జే మేయర్ క్లాస్ ట్యూన్ ఇచ్చారు. అలానే అనురాగ్ కులకర్ణి ఈ సాంగ్ ను ఆలపించారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

    Also Read: నాగశౌర్య “లక్ష్య “సినిమాకు యూ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్…