https://oktelugu.com/

Vivek Oberoi: బాలీవుడ్ లో ట్యాలెంట్ కన్నా ఇంటి పేరు ముఖ్యం అంటున్న… వివేక్ ఒబెరాయ్

Vivek Oberoi: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, విలన్ గా ప్రేక్షకుల్లో వివేక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రక్త చరిత్ర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు వివేక్ ఒబెరాయ్. ఆ తర్వాత రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’లో విలన్‌ గానూ మెప్పించాడు. కాగా చిత్ర పరిశ్రమలో ఎక్కడైనా నేపోటిజం ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ జనం ముందుకు వాచీ మాట్లాడే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 05:58 PM IST
    Follow us on

    Vivek Oberoi: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, విలన్ గా ప్రేక్షకుల్లో వివేక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రక్త చరిత్ర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు వివేక్ ఒబెరాయ్. ఆ తర్వాత రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’లో విలన్‌ గానూ మెప్పించాడు. కాగా చిత్ర పరిశ్రమలో ఎక్కడైనా నేపోటిజం ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ జనం ముందుకు వాచీ మాట్లాడే ధైర్యమే ఎవరికి లేదు. అది ముఖ్యంగా బాలీవుడ్ లో ఉందని చాలా మంది బాహాటంగానే ఒప్పుకొన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ”బాలీవుడ్ లో ట్యాలెంట్ ముఖ్యం కాదు ఇంటి పేరు ముఖ్యం… ఇక్కడ ప్రతిభను ఎవరు చూడరు, వారి పేరు వెనుక ఇంటిపేరు ఏమున్నదో అదే చూస్తారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వివేక్ ఓబెరాయ్.

    Vivek Oberoi

    Also Read: మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్న పునీత్ రాజ్ కుమార్…

    ప్రస్తుతం వివేక్ ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ మూడవ సీజన్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా వివేక్ నేపోటిజం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ నేను నటుడిగా ఇబ్బంది పడుతూనే ఉన్నాను, హిందీ చిత్ర పరిశ్రమను ఎక్స్‌క్లూజివ్‌ క్లబ్‌గా మార్చేశారు. కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడం ఉండదు ఇక్కడ… ఎంతవరకు తమ బంధువులు, తమ వారసులు అనేదే ఉంటుంది.. ఆ ఇంటిపేరు ఉన్న ఎవరైనా వారికి ప్రతిభ ఉండనక్కర్లేదు అని కన్నీటి పర్యంతమయ్యారు. లేకపోతే ఎవరో ఒకరి గ్రూప్‌లో చేరి ఉండాలి, వారికి మాత్రమే బాలీవుడ్‌లో అవకాశాలు దక్కుతాయి. అవకాశాలకు, ప్రతిభకు ఇక్కడ సంబంధం ఉండదు. ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం… అయితే ఇండస్ట్రీలో యువరక్తం నింపేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. వీలైనంతగా కొత్తవారిని ఇండస్ట్రీలోకి తీసుకొస్తూ ప్రోత్సహిస్తున్నాను ’ అని వివేక్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వివేక్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. గతంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించినప్పుడు కూడా బాలీవుడ్ లో నెపోటిజం పట్ల పలువురు గళం విప్పారు. మరి ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

    Also Read: ఫుల్ స్పీడ్ లో విక్రమ్ – వేద హిందీ రీమేక్ షూటింగ్…