Siren Teaser Review: ఈ మధ్య క్రైమ్ థ్రిల్లర్స్ బాక్సాఫీస్ వద్ద బాగా వర్కవుట్ అవుతున్నాయి. హీరో జయం రవి అదే జోనర్ ఎంచుకున్నాడు. పూర్తి స్థాయి క్రైమ్ థ్రిల్లర్ కాకున్నా కమర్షియల్ అంశాలతో సైరెన్ చిత్రం చేశాడు. సైరెన్ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ షురూ చేశారు. అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటించారు. సైరెన్ టీజర్ నేడు విడుదల కాగా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అనుపమ పరమేశ్వరన్ హీరో క్యారెక్టర్ ని పరిచయం చేస్తున్న వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలైంది.
ఓపెన్ చేస్తే జయం రవి జైలులో ఖైదీగా ఉన్నాడు. అతడు హత్యానేరంలో శిక్ష అనుభవిస్తున్న 250 మంది ఖైదీల ఒక సీరియల్ మేటర్ డిస్కస్ చేస్తున్నాడు. జీవిత ఖైదు అనుభవించిన జయం రవి 14 ఏళ్ల తర్వాత బయటకు వస్తాడు. జయం రవిలో మరో కోణం కూడా టీజర్లో చెప్పారు. ఒకప్పుడు అతడు మంచి మనసు కలిగిన అంబులెన్స్ డ్రైవర్. అంబులెన్స్ డ్రైవర్ హంతకుడు ఎలా అయ్యాడు. ఎందుకు శిక్ష పడింది. తన శత్రువులు ఎవరు? అనేది అసలు కథ.
జయం రవి చేసిన హత్యలను ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ గా కీర్తి సురేష్ రోల్ ఉంది. పోలీస్ లుక్ లో కీర్తి సురేష్ ఆకట్టుకుంది. ఇక అనుపమ పరమేశ్వరన్ ఫ్లాష్ బ్యాక్ లో జయం రవి భార్యగా కనిపిస్తుంది. క్రైమ్, సస్పెన్సు, యాక్షన్, ఎమోషన్స్ ప్రధానంగా సైరెన్ మూవీ తెరకెక్కింది. టీజర్ ఆకట్టుకున్న నేపథ్యంలో అంచనాలు పెరిగాయి.
సైరెన్ డిసెంబర్ నెలలో విడుదల కానుంది. ఇంకా తేదీ నిర్ణయించలేదు. సముద్రఖని, యోగిబాబు ఇతర కీలక రోల్స్ చేశారు. సైరెన్ చిత్రానికి ఆంటోని భాగ్యరాజ్ దర్శకుడు. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. ఈ మూవీలో సాంగ్స్ కి పెద్దగా ప్రాధాన్యత లేదనిపిస్తుంది. విలక్షణ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న కీర్తి సురేష్ పోలీస్ గా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి…
