https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: కెప్టెన్సీ టాస్క్ లో కొట్లాట… తొండి గేమ్ కి తెరలేపిన సీరియల్ బ్యాచ్!

రతిక అయితే ఫస్ట్ రౌండ్ లోనే అవుట్ అయిపోయింది. ఆ తర్వాత గౌతమ్ కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకున్నాడు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ గేమ్ ఆడారు. ప్రశాంత్ గేమ్ మొదలైనప్పటి నుంచి దూకుడుగా ఆడాడు.

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2023 / 06:08 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ వారం గేమ్ ఆసక్తికరంగా సాగుతుంది. కాగా ఈ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ ఫ్లోర్ పై ఉన్న షీట్స్ మీద మాత్రమే నడుచుకుంటూ వెళ్లి అటు వైపు ఉన్న బ్రిక్స్ తెచ్చి ఇటు వైపు పెట్టాలి. ఎవరు ఎక్కువ బ్రిక్స్ తెచ్చి పెడితే వాళ్ళు తర్వాతి రౌండ్ కి వెళ్తారు. ఇది టాస్క్ లో మొదటి లెవెల్ అన్నమాట. ఇక బజర్ మోగగానే కంటెస్టెంట్స్ అందరూ పరుగులు పెడుతూ బ్రిక్స్ తెచ్చే ప్రయత్నం చేశారు.

    ఇక రతిక అయితే ఫస్ట్ రౌండ్ లోనే అవుట్ అయిపోయింది. ఆ తర్వాత గౌతమ్ కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకున్నాడు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ గేమ్ ఆడారు. ప్రశాంత్ గేమ్ మొదలైనప్పటి నుంచి దూకుడుగా ఆడాడు. యావర్, అమర్ దీప్, అర్జున్ లు కూడా గట్టిగానే పోటీ పడ్డారు. శివాజీ రెండు రౌండ్లు వేసే సరికి ఆయాసపడినట్లు కనిపించాడు. శోభా కూడా మధ్యలోనే అవుట్ అయినట్లుంది.

    కాగా అమర్ బ్రిక్స్ లెక్కపెడుతుండగా .. ఇది నాది అంటూ ప్రశాంత్ అనడంతో అమర్ కి కోపం తన్నుకొచ్చింది. ఏంట్రా .. నీది ఇదిగో ఇవన్నీ నీవే తీసుకో పో అంటూ అమర్ ఫైర్ అయ్యాడు . ప్రశాంత్ వాదించడంతో .. అమర్ కోపం తో తలకు పెట్టుకున్న బ్యాండ్ తీసి విసిరికొట్టాడు. మరోసారి అమర్ తన అగ్రెషన్ బయటకు తీశాడు. ఎదుటోళ్లు చెప్పకుండా మాట్లాడాడు.

    దీంతో సంచాలక్ గా ఉన్న శోభా ‘ సంచాలక్ ని ఎందుకు పెట్టారు బిగ్ బాస్ .. నన్ను మాట్లాడనివ్వట్లేదు.. మీలో మీరే వాదించుకుంటే వాదించుకోండి అంటూ అరిచింది. యావర్ ..ప్రశాంత్ ఆగాండ్ర అంటూ శోభా సర్ది చెప్పడానికి ట్రై చేసింది. అమర్ మాత్రం తగ్గలేదు .. ‘ మీరే తీసుకొండ్రా .. అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ప్రశాంత్ సైలెంట్ గా చూస్తూ ఉండిపోయాడు. ఇక ఈ వారం ఇంటికి కొత్త కెప్టెన్ ఎవరు అవుతారో అనేది నేటి ఎపిసోడ్ లో చూడాలి మరి. కెప్టెన్ అయిన హౌస్ మేట్ ఈ వారం ఎలిమినేట్ కాకపోతే, ఈజీగా 13వ వారంలో అడుగుపెడతాడు.