Savi Sidhu : స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో కనిపించి తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. కానీ ఆ తర్వాత అనుకోకుండా సినిమాలకు దూరమయ్యాడు. సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఐదేళ్ల తర్వాత ఈ నటుడు ముంబైలోని ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ముంబైకి వెళుతుంటారు. కెరియర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలను అలాగే ఎన్నో కష్టాలను ఎదురుకొని సినిమాలలో అవకాశాన్ని అందుకుంటారు. కొంతమంది మాత్రం జీవితాంతం అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎంతో కష్టపడి సినిమాలలో అవకాశం అందుకున్న తారలు చాలామంది ఆ తర్వాత మాత్రం తమకు వచ్చిన స్టార్డం నిలబెట్టుకోవడంలో విఫలమవుతారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే నటుడు ఈ జాబితాకు చెందిన వాడే. ఒకప్పుడు ఇతను సినిమా ఇండస్ట్రీలో తోపు నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ముంబైలోని ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్ గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నటుడి పేరు సావి సిద్ధు.
Also Read : అల్లు అర్జున్, చిరంజీవి మధ్య ఆసక్తికరమైన పోరు..గెలిచేది ఎవరో!
ఒకప్పుడు ఇతను అనేక సినిమాలలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. మొదట్లో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన ఇతను ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటించాడు. ప్రస్తుతం ఇతను అన్ని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. లక్నోకు చెందిన సావీ సిద్దు తన కెరియర్ను మోడలింగ్ రంగంలో మొదలుపెట్టాడు. ఒకవైపు లా చదువుతూనే మరోవైపు నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. సావి సిద్ధూ 1995లో రిలీజ్ అయిన సినిమాతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఈ సినిమాలో అతని నటనను గమనించిన ప్రముఖ నిర్మాత అనురాగ కశ్యప్ సావి సిద్ధును పాంచ్ కోసం సంప్రదించడం జరిగింది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకపోయినా కూడా అతని నటన మాత్రం నిర్మాతకు బాగా నచ్చింది.
ఆ తర్వాత ఇతను బ్లాక్ ఫ్రైడే, పటియాల హౌస్, గులాల్, డేడి, బేవకూపియాన్ వంటి అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. చివరిగా సావీ సిద్దు బేవకూఫ్ఫియాన్ సినిమాలో నటించాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరం అయిన సావీ సిద్దు ఐదు సంవత్సరాల క్రితం ముంబైలో అందేరీ వెస్ట్ లో ఉన్న లోకండ్ వాలా లో ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూ కనిపించడం జరిగింది. ఆ నటుడిని గుర్తుపట్టిన కొంతమంది సినిమా పరిశ్రమ వ్యక్తులు అతను సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి గల కారణాలను తెలుసుకున్నారు. సావి సిద్ధూ తన భార్యను కోల్పోయిన తర్వాత తన తల్లిదండ్రులు కూడా అలాగే తన అత్తమామలు కూడా చనిపోవడంతో తను ఒంటరిగా మిగిలిపోయానని తెలిపాడు. తనను ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టడంతో ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నానని తెలిపాడు.