Hemachandra- Sravana Bhargavi: సినీ లోకంలో సంసారాలు చక్కగా నిలబడవని ఓ టాక్ ఉంది. సమంత-నాగచైతన్య సహా ఎంతో మంది సెలబ్రెటీ జంటలు చిన్న చిన్న కారణాలతో విడిపోతున్నారు.మనసులు ముక్కలు చేసుకొని సోషల్ మీడియాలో భారమైన పోస్టులు పెట్టారు.ఇప్పుడు సమంత-నాగచైతన్య బాటలో మరో జంట విడిపోతున్నారని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగింది.

టాలీవుడ్ ప్రముఖ సింగర్స్ జంట హేమచంద్ర-శ్రావణ భార్గవిలు విడిపోతున్నారంటూ.. కొద్దిరోజులుగా వేర్వేరుగా ఉంటున్నారని సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు. దీనికి తోడు పలు వెబ్ సైట్లు, యూట్యూబ్ చానెల్స్ హోరెత్తిస్తున్నాయి. హేమచంద్ర-శ్రావణ భార్గవి లు త్వరలో విడాకులు తీసుకోవడమే ఆలస్యం అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఎంతో మంది ముందుగా ఈ వార్తలను ఖండించడం.. అనంతరం విడిపోవడం కామన్ గా మారింది. ఇప్పుడీ గాయకుల జంట కూడా అదే మాదిరిగా విడిపోతుందని అనుకున్నారు.
Also Read: Bandla Ganesh Satires On Pavan:పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తున్న బండ్ల గణేష్
సినిమాల్లో కలిసి పాడిన వీరి మనసులు కలిశాయి. దీంతో 2009లో పెద్దల అంగీకారంతో 9 ఏళ్ల క్రితం ఈ జంట వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఎక్కడా ఓవర్ గా ప్రవర్తించకుండా పద్దతిగానే ఈ జంట మెసులుతూ వస్తోంది.వీరికి చాలా మంది అభిమానులున్నారు. అలాంటిది ఇప్పుడు వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని.. విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం సాగింది.
ఇంజనీరింగ్ చదివి.. ఎంబీయే చేసిన శ్రావణ భార్గవి పాటలు పాడడంతో పాటు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందింది. ఇక హేమచంద్ర డబ్బింగ్ ఆర్టిస్టుగా.. నాలుగైదు సినిమాలకు మ్యూజిక్ కూడా అందించాడు.

తాజాగా తమ విడాకులపై వస్తున్న వార్తలకు హేమచంద్ర-శ్రావణ భార్గవి స్పందించారు. అవన్నీ తప్పుడు వార్తలు అని ఈ జోడీ వెల్లడించింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ వేదికగా వీరు పోస్టులు పెట్టి క్లారిటీ ఇచ్చారు. ‘ఇలాంటి అనవసర.. అప్రస్తుత, పనికిరాని సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది’ అని హేమచంద్ర పోస్ట్ పెట్టారు. యూట్యూబ్ లో విడాకులపైనే అడుగుతున్నారని.. సాధారణం కంటే తన వ్యూస్ పెరిగాయని.. ఎక్కువ వర్క్, సంపాదన లభిస్తోందని.. మీడియా వల్ల తమకు మంచే జరుగుతోందని శ్రావణ భార్గవి విడాకులపై తేల్చేసింది. తాము కలిసే ఉన్నామని ఈ జోడీ క్లారిటీ ఇచ్చేసింది.
Also Read:ETV- Jabardasth: చేతులారా వాళ్లను వదులుకుంటున్నారా? ఈటీవీ వెనుకబడడానికి కారణాలేంటి?
[…] Also Read: Hemachandra- Sravana Bhargavi: విడాకులపై సంచలన ప్రకటన చే… […]
[…] Also Read: Hemachandra- Sravana Bhargavi: విడాకులపై సంచలన ప్రకటన చే… […]
[…] Also Read: Hemachandra- Sravana Bhargavi: విడాకులపై సంచలన ప్రకటన చే… […]
[…] Also Read: Hemachandra- Sravana Bhargavi: విడాకులపై సంచలన ప్రకటన చే… […]