https://oktelugu.com/

Bandla Ganesh Satires On Pavan:పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తున్న బండ్ల గణేష్

Bandla Ganesh Satires On Pavan: టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి సెలబ్రిటీస్ లో ఎంత మంది ఫాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ న్యూస్ వచ్చిన సాధారణ అభిమాని లాగానే ఎంజాయ్ చేస్తుంటారు..ఇక పవన్ కళ్యాణ్ కి భక్తుడు ఇండస్ట్రీ లో ఎవరు అంటే మన అందరికి టక్కుమని గుర్తుకువచ్చే పేరు బండ్ల గణేష్..ఈయనకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..పవన్ కళ్యాణ్ సినిమాలకి జరిగే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2022 / 05:50 PM IST

    Bandla Ganesh, Pavan Kalyan

    Follow us on

    Bandla Ganesh Satires On Pavan: టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి సెలబ్రిటీస్ లో ఎంత మంది ఫాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ న్యూస్ వచ్చిన సాధారణ అభిమాని లాగానే ఎంజాయ్ చేస్తుంటారు..ఇక పవన్ కళ్యాణ్ కి భక్తుడు ఇండస్ట్రీ లో ఎవరు అంటే మన అందరికి టక్కుమని గుర్తుకువచ్చే పేరు బండ్ల గణేష్..ఈయనకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..పవన్ కళ్యాణ్ సినిమాలకి జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో బండ్ల గణేష్ కి స్పీచ్ కి ఉండే క్రేజ్ మామూలుది కాదు..ముఖ్యంగా వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ ‘ఈశ్వర పవనేశ్వర’ అంటూ ఇచ్చే ప్రసంగం ఇప్పటికి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది..అభిమానులు పవన్ కళ్యాణ్ కి వేసే ఫ్లెక్సీలలో ఈ స్లోగన్ ని తెగ వాడేస్తున్నారు..కానీ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఉద్దేశపూర్వకంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ బండ్ల గణేష్ కి ఆహ్వాన పత్రిక ఇవ్వకపోవడం తో బండ్ల గణేష్ చాలా హర్ట్ అయ్యాడు.

    Bandla Ganesh

    Also Read: NTR- Koratala Siva: ఆ కల్చర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన ఎన్టీఆర్

    త్రివిక్రమ్ శ్రీనివాస్ తనని కావాలనే పిలవలేదని ఒక్క అభిమానితో బండ్ల గణేష్ ఫోన్ లో చెప్తున్న రికార్డింగ్ అప్పట్లో పెను దుమారమే రేపింది..ఇక భీమ్లా నాయక్ సినిమా విడుదలైన తర్వాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని పలు మార్లు కలవడానికి ప్రయత్నాలు చేసాడట..కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ని కలవనివ్వకుండా అడ్డం పెడుతున్నట్టు బండ్ల గణేష్ ఆరోపణలు చేస్తునట్టు సమాచారం..ఇక అప్పటి నుండి పవన్ కళ్యాణ్ కి మరియు బండ్ల గణేష్ కి మధ్య చాలా దూరం పెరిగిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇది ఇలా ఉండగా ఇటీవల కాలం లో ట్విట్టర్ లో బండ్ల గణేష్ పెడుతున్న కొన్ని ట్వీట్లు ఎవరికో పరోక్షంగా సెటైర్లు విసురుతున్నట్టు తెలుస్తుంది..ప్రతి రోజు ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ జపం చేస్తూ ఉండే బండ్ల గణేష్ ఇటీవల కాలం లో బాగా తగ్గించేసాడు..దానికి పరోక్షంగా ఆయన చేస్తున్న కొన్ని కామెంట్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చిరాకు రప్పిస్తున్నాయి..మరి ఈ ట్వీట్స్ బండ్ల గణేష్ త్రివిక్రమ్ కి కౌంటర్ గా వేస్తున్నాడా..లేదా పవన్ కళ్యాణ్ తనని ఈమధ్య కాలం లో దూరం పెట్టాడనే ఆవేశం లో ఆయనపై పరోక్ష విమర్శలు చేస్తున్నాడా అనేది ప్రస్నార్ధకంగా మారింది.

    Bandla Ganesh, Pavan Kalyan

    Also Read: Rashmika Mandanna: షాకింగ్: భారీగా పెంచేసిన రష్మిక మందన్నా

     

    Tags