Hoardings Against PM Modi: జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నందున ఆ పార్టీ నేతలు భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో నగరమంతా కాషామయం కానుంది. దీనికి కౌంటర్ గా మోడీపై వ్యతిరేక ప్రచారంతో ఫ్లెక్సీలు వెలువడం సంచలనం సృష్టిస్తోంది. చాలు మోదీ.. చంపకు మోదీ అంటూ డిజిటల్ బ్యానర్లు వెలిశాయి. దీనిపై బీజేపీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీని వెనుక టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని ఆరోపిస్తోంది. బీజేపీపై వ్యతిరేకతతో ఇలాంటి వ్యవహారాలకు తెగబడుతోందని దుయ్యబట్టింది దీనిపై నగరంలో గొడవలు రేగే అవకాశాలు వస్తున్నాయి.
గతంలో కూడా కేసీఆర్ ప్లీనరీ సమయంలో సాలు సారూ.. కేసీఆర్ సారూ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఇదంతా బీజేపీ నేతల పనే అని అప్పట్లో టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. దానికి కౌంటర్ గానే ఇలాంటి బ్యానర్లు ఏర్పాటు చేయడం వారి పనే అనే అనుమానాలు వస్తున్నాయి. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జులై 3న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో అక్కడే మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా అధికార పార్టీ నిర్వాకమే అని చెబుతున్నారు. అంతకు అంత ప్రతీకారం తీర్చుకుంటామని బీజేపీ నేతలు చెబుతుండటం గమనార్హం.
Also Read: Telangana- AP Assembly Delimitation: విభజన చట్టంలో కదలిక.. నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు!
రాష్ట్రంలో పాగా వేయాలని కమలదళం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించి తమ పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. ఇందుకోసమే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో నగరం మొత్తం కాషాయ మయం అయిపోయింది. ఎటు చూసినా బీజేపీ జెండాలే కనిపిస్తున్నాయి. దీంతో గులాబీదళంలో కడుపు మంట పెరుగుతోంది. అందుకే ఇలా చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పాగా వేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరకు కమలమే తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సాలు దొర.. సెలవు దొర అనే దానికి బదులుగానే ఇలా చేయడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కాలం చెల్లిందని తెలుస్తోందని చెబుతున్నారు. ఎందరు పీకేలు వచ్చినా కేసీఆర్ ఓటమి తథ్యమని తెలుస్తోంది. అందుకే టీఆర్ఎస్ నేతలు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని భావిస్తున్నారు. కార్యకర్తల సమీకరణలో అందరు సమష్టిగా కృషి చేసి మోడీ సభను విజయవంతం చేయాలని సూచిస్తున్నారు. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నట్లు సమాచారం.