నవరత్నాల్లో భాగమైన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏపీలో జోరుగా నడుస్తోంది. జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ స్కీమ్‌లో ఎక్కడా లోపాలు రాకుండా చూస్తున్నారు. ప్రతీ నిరుపేదకు ఇల్లు ఉండాలనే టార్గెట్‌తో జగన్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Also Read: న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు ఆగ్రహం..!
రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి ఇంటి పట్టా రాలేదనే మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. ఇంటి పట్టాలు అర్హులందరికీ అందాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో జగన్ సమావేశం అయ్యారు. పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే వారికి వెంటనే పట్టాలు ఇప్పించాలని సూచించారు. అర్హులకు పథకాలను కత్తిరించే ప్రభుత్వం కాదని.. పేదల సంక్షేమం కోసం యజ్ఞంలా చేస్తున్నామన్నారు. అర్హులకు పథకాలన్నీ అందాల్సిందేనని.. అదే సమయంలో అనర్హతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.
సంక్షేమ పథకాల దరఖాస్తులు ఎక్కడా పెండింగ్‌లో ఉండకూడదన్నారు. ముఖ్యంగా పింఛన్, బియ్యం కార్డు, ఇంటి పట్టాకు సంబంధించి సచివాలయాల్లో పెండింగ్‌లో పెట్టకూడదన్నారు. అర్హులైన వారికి 10 రోజుల్లో బియ్యం కార్డు, 10 రోజుల్లో పింఛన్, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టా ఇస్తామని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ లక్ష్యాలను కచ్చితంగా అందుకుంటూ ముందుకు సాగాలని.. ఎప్పటికప్పుడు వస్తున్న దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ఈ వివరాలు తెలుపుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో బోర్డులు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఉన్నాయా? లేవా? అనేది మరోసారి పరిశీలన చేయాలని సూచించారు. అమ్మ ఒడి పథకానికి అధికారులు సిద్ధం కావాలన్నారు.
Also Read: బ్యాంకులకు మరో కంపెనీ టోకరా : ఐదు వేల కోట్లు ముంచారు
మరోవైపు.. రాష్ట్రంలో ఈ విగ్రహాల ధ్వంసం రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరోసారి వాటిపై స్పందించిన జగన్.. దేవుడితో చెలగాటమాడితే దేవుడే శిక్షిస్తాడు అంటూ వ్యాఖ్యానించారు. విగ్రహాల విధ్వంసం వంటి ఘటనలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోసారి ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా చర్యలుండాలన్నారు. రామతీర్థం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్