https://oktelugu.com/

Singer Sunitha: నేను మోసపోయాను… రెండో పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఓపెన్ అయిన సింగర్ సునీత

చాలా విషయాల్లో నేను మోసపోయాను. 17 ఏళ్లకు పరిశ్రమకు వచ్చాను. కొన్ని కారణాల వలన 19 ఏళ్లకు వివాహం చేసుకున్నాను. సంపాదన, కుటుంబ బాధ్యతలు తీసుకున్నాను. 21 ఏళ్లకే కొడుకు ఆకాష్ పుట్టాడు.

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2023 3:01 pm
    Singer Sunitha

    Singer Sunitha

    Follow us on

    Singer Sunitha: సింగర్ సునీత లేటెస్ట్ ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశారు. తన రెండో పెళ్లితో పాటు మొదటి వివాహం, తర్వాత ఏర్పడిన పరిణామాలు. కెరీర్లో ఎదురైన ఒడిదుడుకుల గురించి ఎమోషనల్ అయ్యారు. సునీత మాట్లాడుతూ… జీవితంలో కష్టాలు సాధారణం. వాటిని మనం ఎలా ఎదిరించి నిలబడ్డామన్నది నిజం. నాకు ఎదురైన సంఘటనలు నేను మర్చిపోయాను. చుట్టాలు మాత్రం అప్పుడప్పుడు నేను ఎంతగా ఏడ్చానో గుర్తు చేస్తూ ఉంటారు.

    చాలా విషయాల్లో నేను మోసపోయాను. 17 ఏళ్లకు పరిశ్రమకు వచ్చాను. కొన్ని కారణాల వలన 19 ఏళ్లకు వివాహం చేసుకున్నాను. సంపాదన, కుటుంబ బాధ్యతలు తీసుకున్నాను. 21 ఏళ్లకే కొడుకు ఆకాష్ పుట్టాడు. 24 ఏళ్లకు కూతురు శ్రేయ పుట్టింది. పిల్లలను చూసుకుంటూనే సింగర్ గా కొనసాగాను. నాన్న వ్యాపారం చేసి నష్టపోయారు. ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కెరీర్ మొదలుపెట్టాను. 35 ఏళ్ళు వచ్చే వరకు కష్టపడుతూనే ఉన్నాను.

    నా చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేశారు. అది తెలిసి షాక్ అయ్యేదాన్ని. నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. హస్కీ వాయిస్. మాటలు మింగేస్తుందని విమర్శలు చేసేవాళ్ళు. 25 ఏళ్ల కెరీర్లో 5 వేలకు పైగా షోలు చేశాను. వ్యక్తిగత విమర్శలు స్టూడియో బయట వరకే ఉండాలి. దేవాలయం ఎదుట చెప్పులు విడిచి లోపలికి వచ్చినట్లు వ్యక్తిగత విషయాలు బయట ఉంచి స్టూడియోలోకి రావాలి.

    నేను చాలా సున్నితంగా ఉంటాను. విమర్శలు తట్టుకోలేను. అందుకే ఏడ్చేస్తాను. రెండో పెళ్లి చేసుకోవడం నేను జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయం… అని అన్నారు. సెకండ్ మ్యారేజ్ అనంతరం మొదటిసారి సునీత కెరీర్ బిగినింగ్ నుండి జీవితంలో చోటు చేసుకున్న పలు విషయాలు ప్రస్తావించింది. కాగా సునీత కుమారుడు ఆకాష్ హీరోగా సర్కారు నౌకరి టైటిల్ తో మూవీ చేస్తున్నాడు.