Bigg Boss 7 Telugu: బాత్ రూమ్ లో ఒంటరిగా ఏడ్చిన శోభ… సీరియల్ బ్యాచ్ లో మొదలైన గొడవలు!

శోభా మీరు ఎక్కువ సేపు హోల్డ్ చెయ్యొద్దు అన్న .. అనడంతో మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అంటూ బాల్స్ విసిరికొట్టాడు. మీరు మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ గా ఉంది అని చెప్తున్నాగా అంటూ ప్రశాంత్ శోభా పై అరిచాడు.

Written By: NARESH, Updated On : November 17, 2023 2:56 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ నిర్వహించిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ రేస్ లో వరుసగా మూడు టాస్కులు గెలిచాడు ప్రిన్స్ యావర్. అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఆఖరిగా విల్లు పై బాల్స్ నిలబెట్టాలని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో శివాజీ, ప్రియాంక, ప్రిన్స్ యావర్ పోటీపడ్డారు. దానికి సంచాలకులుగా శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ వ్యవహరించారు. కాగా శివాజీ, యావర్, ప్రియాంక గేమ్ ఆడారు. బజర్ మోగిన ప్రతిసారి ఒక్కో బాల్ విల్లు పై పెట్టి బాలన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా ప్రియాంక బాలన్స్ కోల్పోయి .. గేమ్ నుంచి అవుట్ అయింది.

ఆ తర్వాత శివాజీ బాల్స్ పెడుతుండగా .. శోభా మీరు ఎక్కువ సేపు హోల్డ్ చెయ్యొద్దు అన్న .. అనడంతో మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అంటూ బాల్స్ విసిరికొట్టాడు. మీరు మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ గా ఉంది అని చెప్తున్నాగా అంటూ ప్రశాంత్ శోభా పై అరిచాడు. ఇక యావర్ అందరికంటే ఎక్కువ సేపు బాల్స్ బాలన్స్ చేశాడు. ఆ తర్వాత నియమాల ప్రకారం ఎవరు గెలిచారో నిర్ణయించి చెప్పాలని శోభా, ప్రశాంత్ లను కోరాడు బిగ్ బాస్.

దీంతో రచ్చ మొదలైంది. శివాజీ ఎక్కువసేపు బాల్స్ పట్టుకుని ఉన్నాడని .. గేమ్ నుంచి తొలగిస్తున్నట్టు శోభా ప్రకటించింది. దీంతో శోభా, శివాజీ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కాగా శోభా ప్రియాంక కి ఎవిక్షన్ పాస్ ఇప్పించడానికి చాలా ట్రై చేసింది. ‘ శోభా సంచాలక్ గా ఉన్న ప్రతిసారీ ఫేవరిజం చూపిస్తుంది .. అమర్ లేదా ప్రియాంక ‘ అంటూ శివాజీ, యావర్ తో అన్నాడు. ఆ తర్వాత యావర్ ని విన్నర్ గా ప్రకటించి .. ఎవిక్షన్ పాస్ చేతిలో పెట్టారు.

శివాజీతో జరిగిన గొడవను తెరపైకి తెస్తూ ‘ నేను గాని .. ప్రశాంత్ గాని తీసుకున్న డెసిషన్ రాంగ్ అయితే పనిషమెంట్ తీసుకోడానికి రెడీ’ అంటూ శోభా చెప్పింది. దాంతో ‘ శోభా నువ్వు సంచాలక్ గా మూడు సార్లు ఇబ్బంది పడ్డావ్ అందుకే నేను చెప్పాల్సి వచ్చింది అంటూ శివాజీ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత అమర్ దీప్ కూడా మీరు సంచాలకులుగా తప్పు చేశారు అని చెప్పడంతో .. శోభా తట్టుకోలేక ‘ ఎవరు ఎమన్నా నోరు ఎత్తకూడదు ‘ అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. బాత్ రూమ్ ఏరియాకు వెళ్లి ఒంటరిగా ఏడ్చింది. చూస్తే సీరియల్ బ్యాచ్ మధ్య అంతర్యుద్ధం మొదలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.