https://oktelugu.com/

నాకు పెళ్లంటేనే ఇష్టం లేదు.. లాక్ డౌన్ లో ఏదో జ‌రిగిందిః సింగ‌ర్ సునీత

ప్రముఖ సింగర్ సునీత మొద‌టి పెళ్లి ఎలా జ‌రిగిందో ఎవ్వ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. కానీ.. రెండో వివాహం ఏ రేంజ్ లో జ‌రిగిందో తెలియ‌ని వారు మాత్రం పెద్ద‌గా ఉండ‌రు! మ్యాంగోమూవీస్ అధినేత, బిజినెస్ ‌మెన్‌ రామ్‌ వీరపనేని సునీత మెడలో మూడుముళ్లు వేశారు. జనవరి 9న ఒక్కటైందీ జంట‌. హైదరాబాద్ న‌గ‌ర‌ శివారు శంషాబాద్‌లోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో సునీత-రామ్ వివాహం వైభ‌వంగా జరిగింది. అయితే.. త‌న‌కు ఈ పెళ్లంటేనే ఇష్టం లేదని చెబుతోంది సునీత‌. Also […]

Written By:
  • Rocky
  • , Updated On : February 15, 2021 / 10:16 AM IST
    Follow us on


    ప్రముఖ సింగర్ సునీత మొద‌టి పెళ్లి ఎలా జ‌రిగిందో ఎవ్వ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. కానీ.. రెండో వివాహం ఏ రేంజ్ లో జ‌రిగిందో తెలియ‌ని వారు మాత్రం పెద్ద‌గా ఉండ‌రు! మ్యాంగోమూవీస్ అధినేత, బిజినెస్ ‌మెన్‌ రామ్‌ వీరపనేని సునీత మెడలో మూడుముళ్లు వేశారు. జనవరి 9న ఒక్కటైందీ జంట‌. హైదరాబాద్ న‌గ‌ర‌ శివారు శంషాబాద్‌లోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో సునీత-రామ్ వివాహం వైభ‌వంగా జరిగింది. అయితే.. త‌న‌కు ఈ పెళ్లంటేనే ఇష్టం లేదని చెబుతోంది సునీత‌.

    Also Read: ముంబైలో విజ‌య్ దేవ‌ర‌కొండ.. స్టార్ హీరో కూతురితో రచ్చ!

    సునీత మొద‌టి వివాహం చాలా చిన్న వ‌య‌సులో జ‌రిగింది. కేవ‌లం 19ఏళ్ల వ‌య‌సులోనే ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే.. ఆ తర్వాత‌ విభేదాల కారణంగా ఇద్ద‌రూ విడిపోయారు. కానీ.. అప్ప‌టికే ఇద్ద‌రు పిల్ల‌లు. వారిని తానే పెంచిన సునీత‌.. వారి భ‌విష్య‌త్ గురించి ఆలోచిస్తూ.. చాలా కాలం ఒంటరిగానే గడిపింది.

    ఇప్పుడు వాళ్లు పెద్దవాళ్లయ్యారు. ఈ క్రమంలో వారితోపాటు బంధువులు కూడా కలిసి సునీతకు మళ్లీ పెళ్లిచేశారు. ఈ వేడుక అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. సునీత స్నేహితురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ తోపాటు, యాంకర్ సుమ, దిల్ రాజు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

    అయితే.. రామ్ వీర‌ప‌నేనితో పెళ్లి ఎలా జ‌రిగింది? ఎవ‌రు కార‌ణం? అనే విష‌యాల‌ను ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు సునీత‌. ఈ ఇంట‌ర్వ్యూలో భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ పాల్గొన్నారు. సుమ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించింది. ఈ క్ర‌మంలో రామ్ మాట్లాడుతూ.. తాను ఏడేళ్లుగా ఇష్ట‌ప‌డుతున్నాని, అయితే.. ఎప్పుడూ చెప్ప‌లేద‌న్నారు.

    Also Read: అలియాకు రాజ‌మౌళి స్పెష‌ల్‌ ఆఫ‌ర్‌.. RRRలో స‌రికొత్త రోల్‌!

    సునీత స్పందిస్తూ.. రామ్ తో అప్పుడ‌ప్పుడూ ఫోన్లో మాట్లాడేదాన్న‌ని, ఈ స‌మ‌యంలో ఆయ‌న ‘ఇంకేంటీ..?’ అని అడిగేవాడ‌ని చెప్పింది. అయితే.. ఆ మాట‌ల్లో అర్థాన్ని అప్పుడు గుర్తించ‌లేక‌పోయాన‌ని చెప్పింది సునీత‌. ఆ త‌ర్వాత గుర్తించి, ఫోన్ లిఫ్ట్ చేసేదాన్ని కాద‌ని తెలిపింది. అందుకు కార‌ణం.. అస‌లు త‌న‌కు పెళ్లంటేనే ఇష్టం లేక‌పోవ‌డ‌మేన‌ని చెప్పింది. ఆ త‌ర్వాత లాక్ డౌన్ లో ఏదో జ‌రిగింద‌న్న సునీత‌.. రామ్ ఫోన్ చేసి, ఫోన్లోనే పెళ్లి గురించి ప్ర‌పోజ్ చేశార‌ని వెల్ల‌డించింది సునీత‌.

    కాగా.. సునీత రెండో పెళ్లిపై కొంద‌రు తీవ్ర‌ విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అవ‌న్నీ లైట్ తీసుకున్న‌ సునీత‌.. త‌న ఇద్ద‌రు పిల్ల‌ల స‌మ‌క్షంలో ఆనందంగా, ఆడంబ‌రంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత సోస‌ల్ మీడియాలో మ‌రింత యాక్టివ్ అయ్యారు. అభిమానుల‌తో ట‌చ్ లో ఉంటున్న సునీత‌.. త‌న ఫొటోలు, అప్డేట్స్ పోస్ట్ చేస్తూ చాలా సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్