సాధారణంగా క్రికెటర్ల ఆటను చూసి ఫ్యాన్స్ ఈలలు వేస్తారు. గోల చేస్తారు.. చప్పట్లతో కేరింతలు కొడుతారు. కానీ కరోనా లాక్ డౌన్ పుణ్యమానికి ఆటలకు చెక్ పడింది. ఏడాదిగా క్రీడలు లేవు. ఇటీవల క్రికెట్ ప్రారంభమైన ఫ్యాన్స్ ను అనుమతించలేదు.
Also Read: అద్భుతం జరిగితే తప్ప టీమిండియా గెలుపును ఇక ఆపలేరు
ఇంగ్లండ్ పర్యటనతోనే దేశంలో క్రీడలు మొదలయ్యాయి. క్రికెట్ తోనే ఆరంభమయ్యాయి. అయితే తొలి టెస్టులో ప్రేక్షకులను కరోనా భయానికి అనుమతించలేదు. కానీ రెండో టెస్టుకు అనుమతించారు.
దాదాపు ఏడాది పాటు ఆటకు దూరంగా ఉండడం.. అభిమానుల సందడి లేకుండా క్రికెట్ ఆడిన టీమిండియా క్రికెటర్లకు స్వదేశంలో రెండో టెస్టులో ఫ్యాన్స్ రావడంతో ఆ సంతోషం వెల్లివిరిసింది. ఫ్యాన్స్ అరుపులు, కేకలకు ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిదా అయ్యాడు.
చెన్నై చెపాక్ స్టేడియంలో ఫ్యాన్స్ గోలను రెట్టింపు చేస్తూ స్వయంగా ఈలలు వేస్తూ టిమిండియాకు మద్దతు పలుకాలని కోహ్లీ అభిమానుల వైపు చూస్తూ కోరాడు. ఫ్యాన్స్ ను అలా హోరెత్తించాలని సైగలు చేశాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. బీసీసీఐ స్వయంగా షేర్ చేసి చాలా రోజుల తర్వాత ఇలా అభిమానులతో కలిసి కోహ్లీ సేదతీరాడంటూ ట్వీట్ చేసింది.
Also Read: చెన్నై టెస్ట్ రసవత్తరం: ఇంగ్లండ్ 134 ఆలౌట్.. భారత్ 195 లీడ్
కోహ్లీ ఈలలు వేసి సైగలతో అభిమానులను కోరగానే వారంతా గట్టిగా అరుస్తూ టీమిండియాకు మద్దతుగా హోరెత్తించారు. కోహ్లీ ఈల వేయగానే చెపాక్ స్టేడియం మార్మోగిపోయింది. చప్పట్లు,కేరింతలతో సందడి పీక్ స్టేజ్ కి చేరింది.
https://twitter.com/BCCI/status/1360854727836110850?s=20