https://oktelugu.com/

నేడు సింగర్ సునీత పెళ్లి.. హనీమూన్ కోసం మాల్దీవులకు.. !

సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకుంటున్నారు అనగానే.. తెలుగు ప్రేక్షకులు ఈ వార్త మంచి ఆసక్తి కనబర్చారు. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్న 42 ఏళ్ల సునీత రెండో పెళ్లి ఏమిటి ? అంటూ టాలీవుడ్ కూడా షాక్ అయింది. రామ్ వీరపనేనితో ఆమె నిశ్చితార్ధం జరిగిన దగ్గర నుండి.. సునీత పెళ్లి తేదీ ఎప్పుడూ అంటూ.. ఆ తరువాత రామ్, సునీత తమ వివాహాన్ని వాయిదా వేశారంటూ మరలా ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. Also […]

Written By:
  • admin
  • , Updated On : January 9, 2021 / 04:16 PM IST
    Follow us on


    సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకుంటున్నారు అనగానే.. తెలుగు ప్రేక్షకులు ఈ వార్త మంచి ఆసక్తి కనబర్చారు. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్న 42 ఏళ్ల సునీత రెండో పెళ్లి ఏమిటి ? అంటూ టాలీవుడ్ కూడా షాక్ అయింది. రామ్ వీరపనేనితో ఆమె నిశ్చితార్ధం జరిగిన దగ్గర నుండి.. సునీత పెళ్లి తేదీ ఎప్పుడూ అంటూ.. ఆ తరువాత రామ్, సునీత తమ వివాహాన్ని వాయిదా వేశారంటూ మరలా ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది.

    Also Read: నేను మహేష్‌ కి వదినను కాను: రేణు దేశాయ్‌

    ఏది ఏమైనా సునీత పెళ్లికి టైం ఫిక్స్ అయిపొయింది. సింగర్ సునీత ఈ సాయంత్రం హైద్రాబాద్లోని ఓ గుళ్లో పెళ్లి చేసుకోబోతున్నారు. వందల ఏళ్ళ చరిత్ర కలిగిన పురాతన శ్రీరామచంద్రస్వాముల వారి గుళ్లో సునీత రెండో పెళ్ళి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. డిజిటల్ మీడియా కంపెనీ ఓనర్ రామ్ వీరపనేనితో ఆమె పెళ్లి జరుగుతుండేసరికి.. అందరిలో ఆమె పెళ్లి పట్ల ఆసక్తి రెట్టింపు అయింది.

    ఇక ఇప్పటికే సునీత, రామ్ తమ స్నేహితులకు, ఇండస్ట్రీ ప్రముఖులకు విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే పెళ్ళికి కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది కామన్ ఫ్రెండ్స్ ను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సునీత పిల్లల ఇద్దరు ముందుండి ఆమెకు పెళ్లిని ఘనంగా జరుపుతున్నారు. ఇక పెళ్లి తరువాత సునీత దంపతులు హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్ళబోతున్నారని తెలుస్తోంది.

    Also Read: టీజర్ టాక్: ‘కోబ్రా’తో అదరగొట్టిన విక్రమ్ !

    అక్కడైతేనే ఏకాంతానికి ప్రశాంతత ఉంటుందని సునీత ఏరి కోరి భర్తతో మాల్దీవులకు ప్లాన్ చేశారట. అయితే, పెళ్లి తరువాత ఈ జంట ముందు గుళ్లు చుట్టూ తిరిగనున్నారు. ఆ తరువాతే మాల్దీవులకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్