నేను మహేష్‌ కి వదినను కాను: రేణు దేశాయ్‌

పవర్ స్టార్ మాజీ సతీమణి ‘రేణూ దేశాయ్’ సూపర్ స్టార్ మహేష్ బాబుకి వదినగా నటించబోతుందంటూ గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అయింది. అయితే, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అంటూ తాజాగా రేణు క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఓ నెటిజన్‌.. ఆమెను తాజా చిట్‌చాట్‌లో ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని మొత్తానికి ‘రేణూ దేశాయ్’ చెప్పేసింది. అసలు ఇలాంటి రూమర్లు ఎక్కడి నుంచి పుట్టిస్తున్నారో కూడా […]

Written By: admin, Updated On : January 9, 2021 3:57 pm
Follow us on


పవర్ స్టార్ మాజీ సతీమణి ‘రేణూ దేశాయ్’ సూపర్ స్టార్ మహేష్ బాబుకి వదినగా నటించబోతుందంటూ గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అయింది. అయితే, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అంటూ తాజాగా రేణు క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఓ నెటిజన్‌.. ఆమెను తాజా చిట్‌చాట్‌లో ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని మొత్తానికి ‘రేణూ దేశాయ్’ చెప్పేసింది. అసలు ఇలాంటి రూమర్లు ఎక్కడి నుంచి పుట్టిస్తున్నారో కూడా తనకు తెలియడం లేదు అంటూ ఎదురు ప్రశ్నించింది రేణు.

Also Read: టీజర్ టాక్: ‘కోబ్రా’తో అదరగొట్టిన విక్రమ్ !

పనిలో పనిగా గతంలో కూడా తన పై ఇలాంటి రూమర్ ఒకటి వచ్చిందని.. అదే నేను ‘మేజర్‌’ సినిమాలో కూడా నటిస్తున్నానని అన్నారని.. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్నా అంటున్నారని.. నిజంగా నటిస్తే మాత్రం తానే స్వయంగా ఇన్‌స్టాలో తెలియజేస్తానని ‘రేణూ దేశాయ్’ చెప్పుకొచ్చింది. మరి ఇక నుండైనా మహేష్‌కి వదినగా రేణుదేశాయ్‌ అనే వార్తలకు స్వస్తి చెబుతారేమో చూడాలి.

Also Read: ‘అల్లుడు’ రాక మీద అనుమానాలు !

కాగా ప్రస్తుతం రేణు ‘మహిళలు అనుకుంటే ఏదైనా చేయగలరు’ అనే కథాంశంతో ఆడవాళ్ళల్లో స్ఫూర్తి నింపే ప్ర‌య‌త్నంలో భాగంగా సినిమా చేస్తోంది. ఇప్పటికే మరాఠీలో ‘రేణు దేశాయ్’ ఒక సినిమా తీస్తే.. అక్కడ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అదే తెలుగు సినిమా చేస్తే.. ఎంత లేదు అన్నా సినిమాకి ఫ్రీగా ఫుల్ పబ్లిసిటీ దొరుకుతుందనేది అమె ప్లాన్ లా ఉంది. కాబట్టి ఆమె తెలుగు సినిమాలను చేయడానికి సన్నాహాలు చేసుకుంటుంది. ప్రస్తుతం రేణు దేశాయ్ తెరకెక్కించబోయే సినిమా కథ రైతు కథాంశం పై ఎన్నో విషయాలను రిసెర్చ్ చేసి.. ఆమె రైతు సినిమా తీస్తుందట.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్