https://oktelugu.com/

రాజమౌళి ‘దోస్తీ’ ఓ రేంజ్ లో తీశాడట !

నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించిన డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ప్రమోషన్స్ ను రాజమౌళి పక్కా ప్లాన్ తో ముందుకు తీసుకువస్తున్నాడు. ఈ చిత్రం జస్ట్ ఫస్ట్ సింగిల్ ను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం ఐదు భాషల్లో… ఐదుగురు ఫైనెస్ట్ సింగర్స్ తో.. కీరవాణి అదిరిపోయే రేంజ్ లో ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడట. అయితే, తాజాగా […]

Written By:
  • admin
  • , Updated On : July 29, 2021 / 05:14 PM IST
    Follow us on

    నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించిన డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ప్రమోషన్స్ ను రాజమౌళి పక్కా ప్లాన్ తో ముందుకు తీసుకువస్తున్నాడు. ఈ చిత్రం జస్ట్ ఫస్ట్ సింగిల్ ను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం ఐదు భాషల్లో… ఐదుగురు ఫైనెస్ట్ సింగర్స్ తో.. కీరవాణి అదిరిపోయే రేంజ్ లో ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడట.

    అయితే, తాజాగా ఈ పాట గురించి సింగర్ హేమచంద్ర మాట్లాడుతూ సూపర్ ఎగ్జైట్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సాంగ్ లో ప్రతీ లిరిక్ అద్భుతంగా ఉంటుందని, మెయిన్ గా ఈ ‘దోస్తీ’ సాంగ్ ని రాజమౌళి ఇంకో లెవెల్లో తెరకెక్కించారని చెప్పుకొచ్చాడు. మరి ఈ సాంగ్ ఎలా ఉండనుందో తెలియాలి. ఇక ఆగష్టు 1న ఉదయం 11 గంటలకు ఈ సాంగ్ రిలీజ్ కానుంది.

    కాగా ఈ మల్టీస్టారర్ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండటం, అదేవిధంగా ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తుండటంతో ఈ సినిమాలో ప్రేమ కథలు కూడా ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఇక మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

    అజయ్ దేవగన్ నటించబోతుండటంతో.. ఈ సినిమా కోసం బాలీవుడ్ జనం కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలాగే మిగిలిన కీలక పాత్రలలో ఇతర హాలీవుడ్ నటీనటులను తీసుకోవడంతో అటు హాలీవుడ్ లోనూ ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. దాంతో ఈ భారీ మల్టీస్టారర్ కి ఇంటర్నేషనల్ వైడ్ గా మంచి మార్కెట్ వచ్చే అవకాశం ఉంది.