Virata Parvam: ‘విరాట పర్వం’కు మోక్షం.. కలెక్షన్స్ పైనే అనుమానం

Virata Parvam: హీరో రానా – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన “విరాటపర్వం” పరిస్థితి ఏమిటి ? ఈ సినిమా ఎప్పుడో గతేడాదే రిలీజ్ కావాలి. కానీ ఇప్పటి వరకూ రిలీజ్ పై స్పష్టత కూడా లేదు. మరి, “విరాట పర్వం” టీమ్ ఏమి చేస్తోంది ? మరోపక్క ఈ సినిమాని ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కి అమ్మేశారని వార్తలు వస్తున్నాయి. అయితే, రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చారు […]

Written By: Shiva, Updated On : May 30, 2022 1:22 pm
Follow us on

Virata Parvam: హీరో రానా – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన “విరాటపర్వం” పరిస్థితి ఏమిటి ? ఈ సినిమా ఎప్పుడో గతేడాదే రిలీజ్ కావాలి. కానీ ఇప్పటి వరకూ రిలీజ్ పై స్పష్టత కూడా లేదు. మరి, “విరాట పర్వం” టీమ్ ఏమి చేస్తోంది ? మరోపక్క ఈ సినిమాని ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కి అమ్మేశారని వార్తలు వస్తున్నాయి. అయితే, రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చారు రానా.

Sai pallavai, rana

ఈ సినిమా విడుదలపై రానా మాట్లాడుతూ.. ‘ఒకటి, రెండ్రోజుల్లో సినిమా ప్రివ్యూ చూడబోతున్నాను. ఓ మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి, అతి త్వరలో సినిమా విడుదల చేస్తాం’ అని రానా చెప్పుకొచ్చాడు. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Also Read: Singeetam Srinivasa Rao: విషాదం: లెజెండరీ ద‌ర్శ‌కుడి కంట కన్నీళ్లు

ఎట్టకేలకు ‘విరాట పర్వం’ విడుదల కాబోతుందని, థియేటర్లోనే ఈ మూవీ వస్తుండటంతో దగ్గుబాటి ఫ్యాన్స్‌, ఇటూ సాయి పల్లవి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. నిజానికి నెట్ ఫ్లిక్స్ తో హీరో రానాకి మంచి అనుబంధం ఉంది. ఇప్పటికే తమ సంస్థలో నిర్మించిన “కృష్ణ అండ్ హిజ్ లీల” చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ కి మంచి రేట్ కి అమ్మేశాడు. ఇక ఈ మధ్య “రానా నాయుడు” అంటూ ఓ వెబ్ సిరీస్ ను కూడా నెట్ ఫ్లిక్స్ కోసం చేశాడు.

Virata Parvam

ఈ క్రమంలోనే “విరాటపర్వం” కూడా నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చేయాలని రానా చాలా ప్రయత్నం చేశాడు. కానీ డైరెక్ట్ డిజిటల్ విడుదలకు మేకర్స్ ఒప్పుకోలేదు. థియేటర్ లో ఈ సినిమా సరిగ్గా ఆడదు అని రానా నమ్మకం. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

కాగా తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ విరాటపర్వం సినిమాలో ప్రధాన పాత్రల్లో దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి నటించారు. అయితే, థియేటర్ లో రిలీజ్ చేస్తే విరాట పర్వంకు కలెక్షన్స్ ఎలా వస్తాయి అనే అనుమానం కూడా ఉంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Also Read:Nagababu Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి నాగబాబు

Recommended Videos:


Tags