Senior NTR: స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామ రావు గారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎలాంటి ముద్ర వేసారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..నటుడిగా , నిర్మాతగా మరియు దర్శకుడిగా ఆయన సినీ ప్రస్థానం ఇండియా లో ఏ హీరో కి లేదు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అప్పట్లో ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా లో ఎన్టీఆర్ వీరబ్రహ్మేంద్ర స్వామి గా నటించగా, ఆయన శిష్యుడు సిద్దయ్య పాత్ర ని బాలకృష్ణ పోషించాడు..అయితే ఈ సినిమాలో ఒక్క సన్నివేశం కోసం ఎన్టీఆర్ గారు ఏకంగా మూడేళ్లు కోర్టులో పోరాడాడు అనే విషయం ఈ తరం వారికి ఎంతోమందికి తెలియదు..తనకి తప్పు కాదు అనిపించినా దానికోసం అలుపెరగని పోరాటం చేసే లక్షణం ఉన్న ఎన్టీఆర్..ఈ సన్నివేశం కోసం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన చేసిన పోరాటం నిజంగా ఎంతో మందికి ఆదర్శం అనే చెప్పాలి..ఇంతకీ ఆ సన్నివేశం కోసం ఎన్టీఆర్ ఎందుకు అంత పోరాటం చేసాడు..సెన్సార్ బోర్డు వారు ఎందుకు ఆ సన్నివేశం ని తొలగించాలి అని పట్టుబట్టారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.
ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక్క సన్నివేశం లో ఎన్టీఆర్ శిష్యుడిగా సిద్దయ్య పాత్రలో నటించిన బాలకృష్ణ కి మరియు హీరోయిన్ కి మధ్య కొన్ని సంబాషలనలు ఉంటాయి..ఈ సంభాషణలు అప్పటి జనాలలో చైతన్యం ని ప్రేరేపించే విధంగా ఉంటాయి..అయితే ఈ సన్నివేశం హిందూ మరియు ముస్లిం మతస్తుల మధ్య చిచ్చు పెట్టె విధంగా ఉన్నాయి అని..ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలి అని ఎన్టీఆర్ కి చెప్పారట సెన్సార్ బోర్డు వారు..కానీ ఎన్టీఆర్ అందులో ఎలాంటి తప్పు లేదు అని..ఆ సన్నివేశాలు తొలగించే ప్రసక్తే లేదు అని కోర్టుకి ఎక్కి పోరాటం చేసారు.
Also Read: CM Jagan Delhi Tour: మోడీతో జగన్.. మధ్యలో తెలంగాణే హాట్ టాపిక్?
తీర్పు రావడానికి సుమారు మూడేళ్ళ సమయం పట్టింది..ఎట్టకేలకు ఆ కేసు గెలిచినా ఎన్టీఆర్ అన్ని సన్నివేశం తోనే సినిమాని మూడేళ్ళ తర్వాత విడుదల చేసారు..ఈ సినిమా విడుదల సమయానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి స్థానం లో ఉండడం విశేషం.అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఆ రోజుల్లోనే ఈ సినిమా 4 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి.
Also Read:Atmakur Bypoll- JanaSena: ఆత్మకూరులో జనసేన పోటీచేస్తుందా? మద్దతిస్తుందా?