Sikander : తమిళ స్టార్ డైరెక్టర్ AR మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వం లో సల్మాన్ ఖాన్(Salman Khan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సికిందర్'(Sikandar Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. అయినప్పటికీ సల్మాన్ ఖాన్ కి ఉన్నటువంటి అపరితమైన బాక్స్ ఆఫీస్ స్టామినా కారణంగా ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ దిశగా అడుగులు వేయకుండా, యావరేజ్ రేంజ్ కి స్థిరపడే రేంజ్ లో థియేటర్స్ లో నడుస్తుంది. బాలీవుడ్ ట్రేడ్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 170 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను నాలుగు రోజుల్లో రాబట్టింది. ఇది కేవలం సల్మాన్ ఖాన్ కి కాబట్టే ఈ రేంజ్ లో వచ్చాయని, వేరే బాలీవుడ్ హీరో ఈ చిత్రం చేసుంటే రెండు రోజులకే థియేట్రికల్ రన్ క్లోజ్ అయ్యేదని, సల్మాన్ ఖాన్ కాబట్టే ఇంత దూరమైనా వచ్చిందని అంటున్నారు.
Also Read : సల్మాన్ కెరీర్ లో వరస్ట్ ఓపెనింగ్స్..’సికిందర్’ పరిస్థితి ఇలా ఉందేంటి!
అయితే ఈ సినిమాని సల్మాన్ ఖాన్ కంటే ముందు ఒక టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ స్టోరీ ని వింపించాడట డైరెక్టర్ మురుగదాస్. ఆ హీరో మరెవరో కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun). సరైనోడు చిత్రం పూర్తి అయిన కొత్తల్లో మురుగదాస్ గీత ఆర్ట్స్ ఆఫీస్ కి వచ్చి అల్లు అరవింద్ తో చర్చలు జరిపాడట. అల్లు అర్జున్ కి కూడా కొన్ని రోజుల తర్వాత స్టోరీ ని వినిపించగా, ఆయనకు కూడా బాగా నచ్చిందట. కచ్చితంగా చేద్దామని చెప్పాడు కానీ, ఆ తర్వాత అతనికి ఉన్నటువంటి కమిట్మెంట్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎదురు చూడడం ఇష్టం లేక సల్మాన్ ఖాన్ కి స్టోరీ ని వినిపించి వెంటనే ఓకే చేయించుకొని ఈ సినిమాని తెరకెక్కించాడు. సుమారుగా రెండేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు మన ముందుకు రాబోతుంది.
ఒకవేళ అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని ఒప్పుకొని చేసి ఉండుంటే ఆయన సక్సెస్ స్ట్రీక్ కి పెద్ద బొక్క పడేది. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చెప్పేది అసలు స్టోరీ నే లేదు, స్క్రీన్ ప్లే చాలా నిదానం గా ఉంది అని. ఆరోపించారు. ఎట్టకేలకు అల్లు అర్జున్ కి అదృష్టం బాగుండడం వల్ల ఒక పెద్ద ఫ్లాప్ నుండి తప్పించుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో అట్లీ తో ఒక సినిమా, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా ఉంది. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ ని ఆయన సమాంతరంగా జరిగేలా ప్లాన్ చేస్తున్నాడట. వీటిలో ముందుగా అట్లీ తో చేయబోయే సినిమానే మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది.
Also Read : నిరాశపరుస్తున్న ‘సికిందర్’ అడ్వాన్స్ బుకింగ్స్..సల్మాన్ ఖాన్ కు ఏమైంది?