Sikander : ఇండియా లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరు సల్మాన్ ఖాన్(Salman Khan). ఆయన సినిమాలకు టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో మన అందరికీ తెలిసిందే. అందుకే నిర్మాతలు ఎంత డబ్బులు అడిగినా వెనకాడరు. రీసెంట్ గానే ఆయన ‘సికిందర్'(Sikindar Movie) అనే చిత్రం చేశాడు. AR మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాని సాజిద్ నాడియాద్వాలా(Sajid Nadiadwala) అనే బాలీవుడ్ నిర్మాత గ్రాండ్ గా నిర్మించాడు. ఈమధ్య కాలం లో ఎక్కువగా తన సొంత ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలు చేస్తూ వచ్చిన సల్మాన్ ఖాన్, చాలా కాలం తర్వాత ఆయన ఇతర బ్యానర్ లో నటించాడు. ఈ చిత్రం కోసం ఆయన దాదాపుగా 150 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. అలా భారీ అంచనాల నడుమ ఇటీవలే రంజాన్ కానుకగా విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది.
Also Read : ‘సికిందర్’ చిత్రాన్ని వదులుకున్న టాలీవుడ్ టాప్ స్టార్ హీరో అతనేనా?
దీంతో ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు ఈ సినిమా బయ్యర్స్ కి చుక్కలు చూపించింది. మొదటి రోజు కేవలం 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 140 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇది ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే చిల్లర అనే చెప్పాలి. సల్మాన్ రెమ్యూనరేషన్ 150 కోట్లు, కానీ ఈ చిత్రం కనీసం ఫుల్ రన్ లో 140 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ లెక్క గడితే కేవలం 135 కోట్లు మాత్రమే వచ్చిందట. అంటే సల్మాన్ రెమ్యూనరేషన్ కంటే ఈ చిత్రం 15 కోట్ల రూపాయిలు తక్కువ రాబట్టింది.
దీనిని బట్టి ఈ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి కేవలం 33 వేల మంది మాత్రమే రివ్యూ ఇచ్చారు. వాళ్ళందరి రివ్యూస్ ని కలిపి చూస్తే 10 కి కేవలం 6 పాయింట్స్ మాత్రమే ఈ చిత్రానికి వచ్చింది. ఈమధ్య కాలం లో ఇంత తక్కువ రేటింగ్స్ వచ్చిన సినిమా మరొకటి లేదు. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ కి ఇలాంటి గతి పట్టడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్స్ ని నెలకొల్పే సత్తా ఉన్న సూపర్ స్టార్స్ లో ఒకరు ఆయన. అలాంటి సూపర్ స్టార్ నుండి ఈమధ్య కాలం లో ఒక మంచి సినిమా కూడా రావడం లేదు. భవిష్యత్తులో అయినా ఆయన భారీ కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read : సల్మాన్ కెరీర్ లో వరస్ట్ ఓపెనింగ్స్..’సికిందర్’ పరిస్థితి ఇలా ఉందేంటి!