Allu Arjun : సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తున్నాయి. రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో పెను ప్రభంజనాన్నీ సృష్టించిన ఆయన 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో కూడా మరోసారి భారీ ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన అట్లీ (Atlee) డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి ఆయన పెను ప్రభంజాన్ని సృష్టించి 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. అల్లు అర్జున్ సైతం ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
Also Read : అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇవ్వడం అతని అభిమానులను ఇబ్బంది పెడుతుందా..?
మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపు ఉండడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేయగలిగే కెపాసిటి ఉన్న హీరోగా తనకంటూ ఒక ఐడెంటిటి ని సంపాదించుకున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధిస్తాడా? తద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇకమీదట ఆయన మంచి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తేనే ఆయన మార్కెట్ అనేది పదిలంగా ఉంటుంది. లేకపోతే మాత్రం మరింత పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ సినిమాతో సంపాదించుకున్న మార్కెట్ ను కాపాడుకోవాలంటే మాత్రం ఆయన సినిమాల విషయంలో ఆచితూచి ముందుకు అడుగులు వేయాల్సి ఉంటుంది.
అట్లీ డైరెక్షన్ లో సినిమా చేసిన తర్వాత ఆయన త్రివిక్రమ్(Trivikram ) డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా అసలు ఉంటుందా? లేదా అనే విషయంలో కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది.
Also Raed : అల్లు అర్జున్ రికార్డ్స్ ను బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరోస్…