Keerthy Suresh : ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో అందంతో పాటు అద్భుతమైన అభినయం కనబర్చగల సత్తా ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కీర్తి సురేష్(Keerthy Suresh) పేరు కచ్చితంగా ఉంటుంది. నేటి తరం హీరోయిన్స్ లో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు ని అందుకున్న ఏకైక హీరోయిన్ ఆమె ఒక్కటే. ఆ చిత్రం తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు కీర్తి సురేష్ కి పడలేదు. ‘దసరా’ చిత్రం లో కాస్త మంచి రోల్ పడింది కానీ, అది కీర్తి సురేష్ రేంజ్ కాదు అనే చెప్పాలి. మరోసారి అద్భుతంగా నటించి రెండవ నేషనల్ అవార్డుని అందుకునే క్షణం కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే హీరోయిన్స్ లో ఒకరు కీర్తి సురేష్.
తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అవుతుందేమో, సోషల్ మీడియా వాడకం కూడా తగ్గిస్తుందేమో అని అనుకున్నారు కానీ, అవేమి జరగడం లేదు. తన పెళ్లి కి సంబంధించిన ఫోటోలను దాదాపుగా మూడు నెలలు అప్లోడ్ చేస్తూనే ఉన్నింది కీర్తి సురేష్. రీసెంట్ గా ఆమె తన లేటెస్ట్ ఫోటో షూట్ ని ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఈ ఫోటో షూట్ లో కీర్తి సురేష్ ని చూసిన అభిమానులు, గర్భం దాల్చావా అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆమె పొట్ట కాస్త పెరగడాన్ని అభిమానులు గమనించారు. కానీ అదంతా డ్రెస్సింగ్ స్టైల్ లో భాగమని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఏది నిజం అనేది, ఆమె మరోరోజు కొత్త ఫోటో షూట్ ని ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇంతలోపే సోషల్ మీడియా లో కీర్తి సురేష్ నాలుగు నెలలకే తల్లి అయ్యింది అంటూ కథనాలు ప్రచారం చేస్తున్నారు.
ఇకపోతే కీర్తి సురేష్ కెరీర్ ప్రస్తుతం ఫ్లాప్స్ తోనే నడుస్తుంది. ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈమె దాదాపుగా 5 సినిమాలు చేస్తే అన్ని ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. గత ఏడాది ఈమె ‘బేబీ జాన్’ చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంది కానీ, ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అక్కా’ అనే వెబ్ సిరీస్ తో పాటు, రివాల్వర్ రీటా, కన్నివేడి వంటి సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా తెలుగు లో త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న నితిన్, బలగం వేణు ‘ఎల్లమ్మ’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలతో కీర్తి సురేష్ భారీ కం బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.
Also Read : కన్నీళ్లు పెట్టుకున్న మహేష్ బాబు..వైరల్ అవుతున్న ఇన్ స్టాగ్రామ్ పోస్ట్!
View this post on Instagram