https://oktelugu.com/

Robin Hood Movie : ‘రాబిన్ హుడ్’ బ్రేక్ ఈవెన్ అసాధ్యం..2 రోజుల్లో వచ్చింది ఎంతంటే!

Robin Hood Movie : 'భీష్మ' లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నితిన్ ఆ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల(Venky Kudumula) తో కలిసి చేసిన రెండవ చిత్రం 'రాబిన్ హుడ్'(Robin Hood Movie). శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే గ్రాండ్ గా విడుదలైంది.

Written By: , Updated On : March 30, 2025 / 07:03 PM IST
Robin Hood Movie Collection

Robin Hood Movie Collection

Follow us on

Robin Hood Movie : నితిన్(Nithin Reddy) టైం అసలు ఏ మాత్రం బాగాలేదు. ఒకప్పుడు బాగాలేని సినిమాలకు కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం పర్వాలేదు, బాగుంది అనే రేంజ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు రాలడం లేదు. ‘భీష్మ’ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నితిన్ ఆ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల(Venky Kudumula) తో కలిసి చేసిన రెండవ చిత్రం ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie). శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే గ్రాండ్ గా విడుదలైంది. టాక్ పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చింది కానీ, మొదటి నుండి ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో హైప్, బజ్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల ఓపెనింగ్స్ దారుణంగా దెబ్బ పడ్డాయి. కానీ పాజిటివ్ మౌత్ టాక్ వ్యాప్తి చెంది రెండవ రోజు నుండైనా భారీ వసూళ్లు వస్తాయని అనుకుంటే, అది కూడా జరగలేదు.

Also Read : ‘హరి హర వీరమల్లు’ మే9న విడుదల అవ్వడం అసాధ్యమే..కారణాలు ఏమిటంటే!

హిట్ కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడం తో, ఈ చిత్రానికి విడుదలకు ముందే 28 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది. అంత బిజినెస్ జరిగితే కనీసం ఈపాటికి పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అయినా రాబట్టాలి కదా, కానీ అది జరగలేదు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 36 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబడితే, రెండవ రోజు కోటి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి 3 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. 28 కోట్ల రూపాయిల బిజినెస్ ని జరుపుకున్న సినిమాకు వచ్చే వసూళ్లా ఇవి?, ఇదే ట్రెండ్ కొనసాగితే, ఫుల్ రన్ లో పది కోట్ల రూపాయిల షేర్ రావడం కూడా కష్టమే. నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

సినిమా చూసేందుకు టైం పాస్ ఎంటర్టైనర్ గా అనిపించినప్పటికీ కూడా ఇంత తక్కువ వసూళ్లు రావడం నిజం గా నితిన్ చేసుకున్న దురదృష్టమే అని చెప్పొచ్చు. ఎంత వసూళ్లు వచ్చినా ఈరోజు, రేపే రావాలి. ఇక ఆ తర్వాత శాశ్వతంగా పడిపోయినట్టే అని అనుకోవచ్చు. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 2 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. ఈ సినిమాతో పాటు విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి గంటకు పది వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. చూసారా ఎంత తేడా ఉందో?, ఒకవేళ మ్యాడ్ స్క్వేర్ చిత్రం విడుదల లేకుంటే, కచ్చితంగా రాబిన్ హుడ్ చిత్రానికి వసూళ్లు డీసెంట్ గా వచ్చేవి. పాపం నితిన్ కి ఈ సినిమా ఫలితం మానసికంగా చాలా పెద్ద దెబ్బ తీసి ఉండొచ్చు. ఎందుకంటే విడుదలకు ముందు ఈ సినిమాపై ఆయన పెట్టుకున్న నమ్మకాలు అలాంటివి మరి.

Also Read : ప్రేమ, పెళ్లి…భర్త మరో హీరోయిన్ తో ఎఫైర్.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటి..