Crime News : మనుషుల మధ్య ఉన్న రాక్షసి.. ఈమె గురించి తెలిస్తే విస్తు పోవాల్సిందే..

పోలీసులు వచ్చి ఆమె చనిపోయిందని తెలిశాక..అసలు నిజాలు తెలుసుకొని గాయత్రీ దేవిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు.పియాంగ్ ఒంటిమీద 64 గాయాలు ఉన్నాయట. కొన్ని ఎముకలు కూడా విరిగాయట. అంతేకాదు బ్రెయిన్ మొత్తం రక్తంతో నిండిపోయిందట.

Written By: Swathi Chilukuri, Updated On : April 1, 2024 12:58 pm
Follow us on

Crime News : ఎదుటి వారిని దూషించడం, తిట్టడం, కొట్టడం నేరం. అయినా కొందరు అజమాయిషీ చెలాయిస్తారు. కానీ ఒక మహిళ చేసిన వింత ప్రవర్తన వల్ల మరో మహిళ దారుణంగా చనిపోయింది. ఇంతకీ ఏం జరిగింది అంటే..సింగపూర్ గాయత్రి అనే మహిళ పియాంగ్ అనే మహిళను దారుణంగా చంపేసింది. డబ్బులు కష్టపడి సంపాదించుకోవాలి అనే నెపంతో మైన్మార్ నుంచి సింగపూర్ వెళ్లింది పియాంగ్. మొదటి పని కోసం కన్ స్ట్రక్షన్ వర్క్ లో జాయిన్ అయింది. కానీ కొత్తది వెతుక్కోవాలి అనుకుంది.

Gayatri devi

అయితే ఎవరి ఇంట్లో అయినా పని చేస్తే వారు జీతంతో సహా తిండి పెడుతారు అని అనుకుంది. దీంతో సింగపూర్ గాయత్రి దేవి ఇంట్లో పనికి కుదిరింది పియాంగ్. సమయానికి జీతం ఇచ్చారు. కానీ పనుల్లో ఏవైనా తప్పులు చేస్తే మాత్రం గాయత్రి తో పాటు ఆమె భర్త, తల్లి కూడా తిట్టేవారు. కొన్నిసార్లు తిట్టడం మాత్రమే కాదు కొట్టడం, కాల్చడం, అన్న పెట్టకుండా ఆకలితో మాడ్చడం కూడా చేసేవారట.. ఒకరోజు బట్టలు ఇస్త్రీ చేస్తూ ఏదో మిస్టేక్ జరిగితే చాలా కొట్టారట. వీరు మాత్రమే కాదు పక్క వారు వచ్చి కూడా తిట్టేవారట.

భరించలేక 24 సంవత్సరాల పియాంగ్ పారిపోవాలి అనుకుందట. కానీ కుదరలేదు. గొలుసులతో కట్టేసేవారు. రూమ్ లో వేసి లాక్ వేసేవారు. పాస్ వర్డ్ తెలిస్తేనే లాక్ ఓపెన్ అయ్యేదట. ఈ క్రమంలో ఇరవై నాలుగు కేజీల తగ్గిపోయింది పియాంగ్. ఒకరోజు కట్టేసిన గొలుసులకు వేలాడుతూ కనిపించింది పియాంగ్ దీంతో డాక్టర్ కు ఫోన్ చేశారు. డాక్టర్ వచ్చి గాయాలను చూసి షాక్ అయ్యాడు. అప్పటికే శ్వాస ఆగిపోయింది. కానీ వీరికి చెప్పకుండా ఆ డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడట.

పోలీసులు వచ్చి ఆమె చనిపోయిందని తెలిశాక..అసలు నిజాలు తెలుసుకొని గాయత్రీ దేవిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు.పియాంగ్ ఒంటిమీద 64 గాయాలు ఉన్నాయట. కొన్ని ఎముకలు కూడా విరిగాయట. అంతేకాదు బ్రెయిన్ మొత్తం రక్తంతో నిండిపోయిందట. దీంతో అక్కడ ఉన్నవారంతా గాయత్రీ దేవీ ప్రవర్తనకు విస్తు పోయారు. మొత్తం మీద ఈమె వింత ప్రవర్తనకు ఓ అమాయకపు మహిళ చనిపోయింది. ఇలాంటి వారిని మనుషులు అంటారా? రాక్షసా? తప్పకుండా మనుషుల మధ్య ఉన్న రాక్షసే అనవచ్చు.