https://oktelugu.com/

కొత్తరకం లుక్ లో యంగ్ హీరో !

‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీలా’ మోడ్రన్ రొమాంటిక్ కామెడీ జోనర్ లో సినిమా చేసి అలరించాడు యంగ్ హీరో ‘సిద్ధు జొన్నలగడ్డ’. హీరోగా ఎంట్రీ ఇచ్చి సంవత్సరాలు దాటుతున్నా. మనోడికి అవకాశాలు వస్తోంది మాత్రం ఈ మధ్యే. కాగా తాజాగా ఈ యంగ్ హీరో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. ‘నరుడి బ్రతుకు నటన’లో నటిస్తూ కొత్త రకంగా కనిపించడానికి తన లుక్ ను ఛేంజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సిద్ధూ నేహాశెట్టితో కలిసి రొమాన్స్ చేయనున్నాడు. […]

Written By: , Updated On : February 8, 2021 / 10:19 AM IST
Follow us on

siddu jonnalagadda
‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీలా’ మోడ్రన్ రొమాంటిక్ కామెడీ జోనర్ లో సినిమా చేసి అలరించాడు యంగ్ హీరో ‘సిద్ధు జొన్నలగడ్డ’. హీరోగా ఎంట్రీ ఇచ్చి సంవత్సరాలు దాటుతున్నా. మనోడికి అవకాశాలు వస్తోంది మాత్రం ఈ మధ్యే. కాగా తాజాగా ఈ యంగ్ హీరో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. ‘నరుడి బ్రతుకు నటన’లో నటిస్తూ కొత్త రకంగా కనిపించడానికి తన లుక్ ను ఛేంజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సిద్ధూ నేహాశెట్టితో కలిసి రొమాన్స్ చేయనున్నాడు. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ చిన్న వీడియోను చిత్రబృందం ప్రేక్షకులతో పంచుకున్నారు.

Also Read: పాత హీరోయిన్లను పైకి తెస్తున్న త్రివిక్రమ్

ఇంతకీ ఈ వీడియోలో ‘జిమ్‌ గట్టిగా చేస్తున్నట్టున్నవ్‌గా అని హీరోను అడగ్గా.. లేదు కీటోడైట్‌ చేస్తున్నా అని చెప్పి. ఆ తర్వాత అద్దం ముందు నిల్చొని కండలు చూసుకొని మురిసిపోతుంటాడు’ ఇలా సాగిన ఈ వీడియో ఆసక్తికరంగా ఉండటంతో.. మొత్తానికి జనంలోకి బాగానే వెళ్తుంది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు చేస్తున్నాడు. ఈ సినిమాకు కథ, కథనాలను సమకూర్చుకుని హీరోగా నటిస్తున్నాడు.

Also Read: రాజమౌళితో మహేష్ బాబు సినిమా మరింత ఆలస్యం?

కాగా ఓటిటి కోసం కరోనా టైమ్ లో ప్లాన్ చేసిన సినిమా ఇది. అయితే ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి బాగుంది కాబట్టి, నేరుగా థియేటర్లలోనే రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో డిస్కో జాకీలా నటిస్తున్న సిద్దు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ను పరిచయం చేస్తూ వచ్చిన ఈ వీడియో సినిమా పై అంచనాలను క్రియేట్ చేసింది. మరి చూడాలి సిద్ధుకి ఈ సినిమా కూడా హిట్ అవుతుందేమో.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Meet DJ Tillu | Narudi Brathuku Natana | Siddhu Jonnalagadda - Neha Shetty | Vimal Krishna

Tags