https://oktelugu.com/

రోడ్ల మీదకు వస్తున్నా.. బాలయ్య వ్యాఖ్యలు వైరల్ !

నట సింహం నందమూరి బాలకృష్ణ అంటేనే సరదా మనిషి, పైగా ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం, అందుకే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ బాలయ్య బాబును సీరియస్ గా తీసుకోరు. దీనికితగ్గట్టే ఆయన వ్యవహార శైలి కూడా అలాగే ఉంటుంది. అయితే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయినా.. బలమైన ఫ్యాన్ బేస్ మాత్రం బాలకృష్ణకు ఉంది. అందుకే తరచూ తన అభిమానులతో బాలయ్య ఫోన్‌ లో సంభాషిస్తూ.. కొన్ని సరదా కామెంట్స్ చేస్తూ ఉంటాడు. కాగా తాజాగా […]

Written By:
  • admin
  • , Updated On : February 8, 2021 / 10:11 AM IST
    Follow us on


    నట సింహం నందమూరి బాలకృష్ణ అంటేనే సరదా మనిషి, పైగా ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం, అందుకే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ బాలయ్య బాబును సీరియస్ గా తీసుకోరు. దీనికితగ్గట్టే ఆయన వ్యవహార శైలి కూడా అలాగే ఉంటుంది. అయితే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయినా.. బలమైన ఫ్యాన్ బేస్ మాత్రం బాలకృష్ణకు ఉంది. అందుకే తరచూ తన అభిమానులతో బాలయ్య ఫోన్‌ లో సంభాషిస్తూ.. కొన్ని సరదా కామెంట్స్ చేస్తూ ఉంటాడు. కాగా తాజాగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడి ద్వారా ఫ్యాన్స్‌ తో మాట్లాడాడు బాలయ్య.

    Also Read: పాత హీరోయిన్లను పైకి తెస్తున్న త్రివిక్రమ్

    ఈ సందర్భంగా కొన్ని కామెంట్స్ చేస్తూ.. ‘బోయపాటి సినిమా షూటింగ్ అయిపోగానే.. రోడ్ల మీదకు వస్తున్నా. అందుకోసం ప్లాన్ చేసుకుంటున్నా. మానసికంగానూ సిద్ధం అవుతున్నా. రాష్ట్రంలో రాక్షస పాలన కనిపిస్తోంది. రౌడీయుజం ఎక్కువైపోయింది. అన్నింటిపై పోరాటానికి సిద్ధం అవుతున్నా. నా అసలు స్వరూపం చూపిస్తా’ అంటూ మొత్తానికి బాలయ్య తన రొటీన్ సినిమా డైలాగ్ లు చెప్పుకొచ్చాడు. రాజకీయాలపై బాలయ్య చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు కాల్ రికార్డ్ రూపంలో బయటకు రావడంతో బాగా వైరల్ అయ్యాయి.

    Also Read: రాజమౌళితో మహేష్ బాబు సినిమా మరింత ఆలస్యం?

    ఏది ఏమైనా బాలయ్య బాబు ఎప్పటికప్పుడు తన చిన్న పిల్లాడి మనసును చాటుకుంటునే ఉన్నారు. ఇక ఈ నట సింహం అంటేనే ఒక తెలియని భయం ఉంటుందట. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదని, అందుకే అందరికీ బాలయ్య అంటే కాస్త భయమేనట. ఎవరు ఎన్ని చెప్పుకున్నా సరే.. బాలయ్య స్టార్ హీరో.. ఆయన పై వచ్చే రూమర్స్ నిజం కూడా కావొచ్చు.. కానీ బాలయ్యకి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. కాకపోతే ఆ స్టార్ డమ్ ఇప్పుడు కూడా ఉందా అన్నదే అనుమానం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్