Siddu Jonnalagadda
Siddu Jonnalagadda : ‘డీజే టిల్లు’ సిరీస్ తో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించున్న సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) తో కలిసి ‘జాక్'(Jack Movie) అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితమే విడుదలైన ఈ సినిమా టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని కలిగించింది టీజర్. ఇందులో హీరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లాగా తయారై దొంగతనాలు చేస్తూ ఉంటాడు. కాస్త రవితేజ కిక్ తరహా క్యారక్టర్ అనుకోండి. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) చేస్తుంది. ‘బేబీ’ తర్వాత ఆమె ‘లవ్ మీ : ఇఫ్ యూ డేర్’ అనే చిత్రం చేసింది. ఇది అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.
Also Read :బెట్టింగ్ యాప్ కేసు పై స్పందించిన విజయ్ దేవరకొండ..ట్వీట్ వైరల్!
కానీ ‘జాక్’ చిత్రం మాత్రం సక్సెస్ అవుతుందని ఆమె బలమైన నమ్మకంతో ఉంది. ‘బేబీ’ తర్వాత ఆమెకు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికినట్టు టీజర్ ని చూస్తే తెలుస్తుంది. ఇకపోతే నేడు ఈ సినిమాకి సంబంధించిన కిస్ అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సందర్భంగా మేకర్స్ ఏర్పాటు చేసిన ఈవెంట్ లో హీరో సిద్దు జొన్నలగడ్డ తో పాటు, వైష్ణవి చైతన్య కూడా పాల్గొన్నది. ఈ సందర్భంగా వీళ్ళిద్దరిని విలేఖరులు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. ముందుగా సిద్దు తో మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. అలాంటి స్టైల్ ఈమధ్య కాలం లో మీ సినిమాల్లో కనిపిస్తుంది, దానికి మీరేమైనా హోమ్ వర్క్ చేశారా?’ అని అడగగా, దానికి సిద్దు జొన్నలగడ్డ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ కామెంట్స్ ని షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఆయన సమాధానం చెప్తూ ‘పవన్ కళ్యాణ్ గారి సినిమాలతో నన్ను పోల్చడం అదృష్టం గా భావిస్తున్నాను. తెలుగు సినిమాల్లో హీరో పాత్రలకు కానీ, హీరోయిజానికి కానీ, సరికొత్త స్టైల్ ని తీసుకొచ్చింది ఆయనే. నేను ఆయన లాగా ఉండాలని ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కేవలం మనసుకి నచ్చినట్టు చేసుకుంటూ పోయాను. నా అదృష్టం కారణంగా అవి జనాలకు నచ్చాయి’ అంటూ చెప్పుకొచ్చాడు సిద్దు జొన్నలగడ్డ. అదే విధంగా తమన్ రీసెంట్ గా చేసిన కామెంట్స్ గురించి అడుగుతూ ‘తమన్ ఒక పాట హిట్ అవ్వాలంటే హుక్ స్టెప్ ఉండాలన్నారు..మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడగగా, దానికి సిద్దు సమాధానం ఇస్తూ ‘నిజమే కదా..ఒక పాట హిట్ అవ్వాలంటే కచ్చితంగా హుక్ స్టెప్ ఉండాల్సిందే’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం వచ్చే నెల 10 వ తారీఖున విడుదల కాబోతుంది.
Also Read :సుప్రీం కోర్ట్ ఊరుకునే ప్రసక్తే లేదు..చిక్కుల్లో పడ్డ పవన్ కళ్యాణ్!
‘#PawanKalyan garu introduced Free-Style to films.
అది తిక్క తిక్కగా ఉంటది… కానీ ఒక లెక్క ఉంటది.’– #SidduJonnalagadda pic.twitter.com/3bTU2917wg
— Gulte (@GulteOfficial) March 20, 2025