https://oktelugu.com/

Renault Price Hike : మారుతి, హ్యుందాయ్ దారిలోనే మరో కంపెనీ.. ఏం చేసిందంటే

Renault Price Hike : రెనాల్ట్ ఇండియా ఏప్రిల్ 1 నుండి కిగర్, క్విడ్, ట్రైబర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు సుమారు 2 శాతం వరకు పెరగనున్నాయి. ఈ పెరుగుదల మోడల్స్, వేరియంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

Written By: , Updated On : March 20, 2025 / 07:54 PM IST
Renault Price Hike

Renault Price Hike

Follow us on

Renault Price Hike :రెనాల్ట్ ఇండియా ఏప్రిల్ 1 నుండి కిగర్, క్విడ్, ట్రైబర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు సుమారు 2 శాతం వరకు పెరగనున్నాయి. ఈ పెరుగుదల మోడల్స్, వేరియంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఖర్చును సర్దుబాటు చేయడానికి ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. ఈ ధరలను కంపెనీ చాలా కాలంగా దీనిని భరిస్తోందని చెబుతోంది.

Also Read : రూ.5 లక్షలకే 8ఏళ్ల వారంటీతో కొత్త ఎలక్ట్రిక్ కారు విడుదల

ఫిబ్రవరి 2023 తర్వాత రెనాల్ట్ తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించడం ఇదే మొదటిసారి. రెనాల్ట్ ప్రస్తుతం తన పోర్ట్‌ఫోలియోలో కిగర్, క్విడ్, ట్రైబర్ అనే మూడు మోడల్స్ ను కలిగి ఉంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం భారత మార్కెట్లో కొత్త తరం డస్టర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

రెనాల్ట్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె మాట్లాడుతూ.. చాలా కాలం పాటు ధరలను మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాం.కానీ ఇన్‌పుట్ ఖర్చులు నిరంతరం పెరగడం వల్ల ఈ ధరల పెరుగుదల అనివార్యం అయిందన్నారు. కంపెనీ తన కస్టమర్లను రక్షించుకోవడానికి చాలా కాలంగా ఈ ఖర్చులను భరిస్తోంది. అయితే ఉత్తమ నాణ్యత , కొత్త ఉత్పత్తులను తీసుకురావాలంటే ధరల్లో ఈ మార్పులు అవసరం అన్నారు.

ఇటీవల భారతదేశంలోని అనేక ప్రధాన కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ముడిసరుకు ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు,ఇతర ఆర్థిక ఒత్తిళ్ల పెరుగుదల కారణంగా ఈ ధరల పెంపు అనివార్యం అయింది. మారుతి సుజుకి తన వాహనాల ధరలను 4% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఏప్రిల్ 2025 నుండి తన వాహనాల ధరలను 3% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. టాటా మోటార్స్, స్కోడా, మహీంద్రా, కియా, ఆడి, ఎంజి మోటార్స్, బిఎమ్‌డబ్ల్యూ జనవరిలో ధరల పెంపును ప్రకటించాయి.

రెనాల్ట్ ప్రస్తుతం కిగర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై పని చేస్తోంది. కిగర్ ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ మ్యూల్ ఇప్పటికే టెస్టింగు సమయంలో భారతీయ రోడ్లపై కనిపించింది. రాబోయే నెలల్లో ఇది లాంచ్ అవ్వొచ్చు. నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ లాగానే రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే అదే రూపురేఖలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Also Read : పవర్ ఫుల్ అప్ డేట్స్ తో మార్కెట్లోకి వచ్చిన థార్ రాక్స్