https://oktelugu.com/

Pawan Kalyan : సుప్రీం కోర్ట్ ఊరుకునే ప్రసక్తే లేదు..చిక్కుల్లో పడ్డ పవన్ కళ్యాణ్!

Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక కీలక అంశం విషయంలో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిక్కుల్లో పడ్డాడా?, సుప్రీం ఆదేశాలను పాటించాలా?,

Written By: , Updated On : March 20, 2025 / 03:50 PM IST
Pawan Kalyan

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక కీలక అంశం విషయంలో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిక్కుల్లో పడ్డాడా?, సుప్రీం ఆదేశాలను పాటించాలా?, లేకపోతే ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలా అనే సందిగ్ద పరిస్థితిలో ఆయన ఉండిపోయాడా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మునుపటి లాగా ఈ వ్యవహారం లో దూకుడుగా వెళ్లేందుకు అవకాశాలు లేవు. అలా వెళ్తే తీవమైన ప్రజా వ్యతిరేక పరిస్థితులు ఏర్పడుతాయి. అలా అని ఆ అంశం జోలికి పోకుండా మౌనం వహిస్తే కోర్టు ఊరుకోదు. ఇలాంటి కష్ట సమయంలో జనసేన పార్టీ సీఎం చంద్రబాబు పైనే భారం వేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అసలు ఇంతకూ సమస్య ఏమిటి?, పవన్ కళ్యాణ్ ఎందుకు ఇరకాటంలో పడ్డాడు అనే అంశాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం.

Also Read : పవన్ కళ్యాణ్ చంద్రబాబుల ఫెవికాల్ బంధానికి ఇప్పట్లో ఢోకా లేదు

పూర్తి వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి కొల్లేరు సరస్సు(Kolleru Lake) వస్తుంది. ఈ సరస్సు కొన్నాళ్ల నుండి తీవ్రమైన కబ్జాలకు గురైంది. దీంతో కొల్లేరులో కలవాల్సిన జల ప్రవాహాలకు ఆటకం కలిగి వరదలు వచ్చే పరిస్థితిలు ఏర్పడ్డాయి. దీంతో అప్పట్లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar Reddy) 2006 వ సంవత్సరం లో ఒక ఆపరేషన్ ని మొదలు పెట్టాడు. నాటు బాబులతో వేళా సంఖ్యలో చెరువు గేట్లను పేల్చేశారు. ఇక ఆయన మరణం తర్వాత ఈ ఆపరేషన్ నెమ్మదించింది. అయితే సుప్రీం కోర్టులో ఇప్పుడు తాజాగా పిటీషన్ ప్రభుత్వం పై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చింది. కేవలం మూడు నెలల్లోనే ఆక్రమణలు తొలగిస్తామని సుప్రీంకోర్టుకు(Supreme Court) హామీ ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో పవన్ కళ్యాణ్ పై అటవీ శాఖ మంత్రిగా తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది.

ఈ బాధ్యతలు మొత్తం సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) పై వేస్తూ, ఆయన అనుభవం తో న్యాయం చేయాలనీ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా గతంలో వై ఎస్ ఆర్ ఒక పకడ్బందీ ప్లాన్ తో చేయలేదని, అందుకే ఇప్పుడు ఈ సమస్య ఇంత సున్నిత అంశంగా మారిపోయిందని చెప్పుకొస్తున్నారు. అప్పట్లో ఒడిశాలోని చిల్కా సరస్సు విషయం లో కూడా ఇలాంటి సమస్యనే ఎదురైతే, అక్కడి ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ఆ ప్రభుత్వం అవలంబించిన పద్దతులను ఇక్కడ అధ్యయనం చేయాలనీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. అదే విధంగా చంద్రబాబు అపార అనుభవం తో ఈ సమస్య నుండి గట్టెక్కుతామనే ధీమాని వ్యక్తం చేసింది జనసేన పార్టీ. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది, ఎలాంటి న్యాయం జరుగుతుంది అనేది.

Also Read : చేతులెత్తేసిన పవన్.. చంద్రబాబుపై జనసేన భారం!