Siddu Jonnalagadda : కేవలం మూడు సినిమాలతో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకోవడం అప్పట్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) విషయంలోనే జరిగింది. మళ్ళీ ఆ స్థాయి ఏ హీరోకి కూడా రాదని అనుకున్నారు కానీ, ఈమధ్య కాలంలో ఇండస్ట్రీ లోకి వస్తున్న కుర్ర హీరోలు అప్పట్లో పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన మ్యాజిక్ రిపీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాంటి హీరోలలో ఒకరు సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). కెరీర్ ప్రారంభం లో క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ ద్వారా పాపులర్ అయిన సిద్దు, ఆ తర్వాత హీరో గా మారి ‘గుంటూరు టాకీస్’ చిత్రంతో మొట్టమొదటి సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన నుండి వచ్చిన ‘కృష్ణ & హిస్ లీల’ చిత్రం కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. వీటి తర్వాత వచ్చిన టిల్లు సిరీస్ సిద్దు జొన్నలగడ్డ కెరీర్ ని ఏ స్థాయికి తీసుకెళ్లాయి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సిద్ధూ పలికే డైలాగ్స్, ఆయన కామెడీ టైమింగ్, ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.
Also Read : రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సిద్దు జొన్నలగడ్డ.. శర్వానంద్ తో సమానంగా తీసుకుంటున్నాడుగా!
‘టిల్లు స్క్వేర్’ చిత్రం తో వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన సిద్దు, రీసెంట్ గా విడుదలైన జాక్ చిత్రంతో ఆడియన్స్ ని నిరాశపర్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. కనీసం ఓపెనింగ్స్ ని కూడా ఈ సినిమా సొంతం చేసుకోలేకపోయింది. ఈమధ్య కాలం లో ఒక సినిమాకు ఓపెనింగ్స్ రావాలన్నా, లాంగ్ రన్ రావాలన్నా కచ్చితంగా ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని అలరించాలి, ఆకర్షించాలి. కానీ ‘జాక్’ చిత్రం ఆ విషయంలో విఫలం అయ్యింది. ఒకవేళ కంటెంట్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ ని రాబట్టాలంటే సదరు హీరోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి. సిద్దు కి అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చాలా మంది దర్శక నిర్మాతలు నమ్మారు, అందులో దిల్ రాజు కూడా ఒకరు. కానీ ‘జాక్’ ఫలితం చూసిన తర్వాత సిద్దు పై రిస్క్ చేయాలంటే కాస్త భయపడుతున్నారు నిర్మాతలు. అలా ఈ చిత్రం తర్వాత వంద కోట్ల రూపాయిల బడ్జెట్ సినిమా సిద్దు చేతుల్లో నుండి వెళ్ళిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘గీతా గోవిందం’ డైరెక్టర్ పరశురామ్ సిద్దు జొన్నలగడ్డ కోసం ఒక కథ రాసుకున్నాడు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. అయితే ఈ చిత్రానికి బడ్జెట్ లెక్కలు వేసుకుంటే దాదాపుగా వంద కోట్ల రూపాయిల వరకు చేరింది. జాక్ ఫలితం చూసిన తర్వాత అంత బడ్జెట్ సిద్దు మీద పెట్టొచ్చా లేదా అనేది నిర్ణయించుకోవాలని అనుకున్నాడట దిల్ రాజు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో దిల్ రాజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సిద్దు కి కంటెంట్ కి సంబంధం లేకుండా క్రౌడ్ ని థియేటర్స్ వైపుకు లాకొచ్చే స్టామినా ఇంకా రాలేదని ‘జాక్’ ద్వారా నిరూపితం అయ్యింది. పోనీ పరశురామ్ ని నమ్మి బడ్జెట్ ని ఖర్చు చేద్దామా అంటే, ఆయన ఇప్పటికే దిల్ రాజు తో ‘ది ఫ్యామిలీ స్టార్’ లాంటి భారీ డిజాస్టర్ ని తీసాడు. ఆడియన్స్ ని ఆకరిశించే ప్రీ రిలీజ్ ప్రమోషనల్ కంటెంట్ కచ్చితంగా ఇస్తాడనే నమ్మకం కూడా లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ అట్టకెక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.